Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 63వ రోజు శింగనమల నియోజకవర్గంలో కొనసాగింది. లోకేష్ తో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ పాదయాత్రలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. గంజాయి వద్దు బ్రో అనే నినాదంతో టీడీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో బాలయ్య, లోకేష్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
Advertisement
ఇక యాత్రలో భాగంగా రోజూ వైసీపీ సర్కార్ పై సెటైర్లు వేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు జగన్. అయితే.. ఈసారి ఆ ఛాలెంజ్ చంద్రబాబు సైడ్ నుంచి వచ్చింది. ‘‘చూడు జగన్.. ఇవి మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు! ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?’’ అంటూ నిలదీశారు చంద్రబాబు.
Advertisement
ఆ తర్వాత సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ నిజస్వరూపం తెలియక ప్రజలు ఎన్నుకున్నారని, ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదల కోసం నెల్లూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయల విలువైన ఇళ్లు శిథిలమైపోతున్నాయని వివరించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి రాజ్యమేలుతోందని, ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని మండిపడ్డారు చంద్రబాబు.
రాష్ట్రంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇందులో లోకేష్ ఓ అడుగు ముందుగా ఉన్నారు. మిగిలిన నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో సెల్ఫీ ఛాలెంజ్ లు విసిరేందుకు సిద్ధమౌతున్నారు.