Advertisement
ఇంట్లో ఎంతమంది మగాళ్లు ఉన్నా ఆ ఇంటికి అందం ఉండదు. కానీ ఇంటిలో ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు.అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు అని. మన భారతదేశ సంప్రదాయంలో ఆడపిల్లను లక్ష్మీదేవితో కొలుస్తారు. ఆడపిల్లలను పూజిస్తారు కూడా. కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో చాలా మంది ఒక కుటుంబంలో ఆడపిల్ల ఉండాలని కోరుతూ ఉంటారు. ఎలాంటి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆడపిల్లలతో ముందుగా స్టార్ట్ చేస్తారు. ఒక తండ్రి, తల్లి తర్వాత అంతటీ స్తానాన్ని తన బిడ్డకే ఇస్తారు. కానీ ఆ ఒక్క కుటుంబంలో మాత్రం 138 ఏళ్ల నుంచి ఆడపిల్లల సంతానం లేదు..
Advertisement
Also Read: ఈ 4 క్వాలిటీస్ ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీయే..!!
అందరు మగ పిల్లలు పుడుతూ వచ్చారు. ఆడపిల్ల కోసం ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ చివరకు 138 ఏళ్ల తర్వాత వారి కళ ఫలించింది. వారింట్లో మొదటిసారి ఆడపిల్ల పుట్టింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. మరి అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం.. అమెరికా దేశంలోని మిచిగావ్ కు చెందిన కరోలిన్ ఆన్డ్రు క్లార్క్ జంటకు నాలుగేళ్ల క్రితం కామెరున్ అనే కొడుకు ఉన్నాడు. మార్చి నెలలో రెండో బిడ్డగా ఆడ శిశువుకి జన్మనిచ్చారు ఈ దంపతులు. ఆ చిన్నారికి అండ్రి అని కూడా పేరు పెట్టారు.
Advertisement
Also Read:Telangana Summer Holidays: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్..వేసవి సెలవులు ఎప్పటినుంచంటే..?
అయితే ఈ చిన్నారి 138 సంవత్సరాల తర్వాత వారి వంశంలో మొదటిసారి పుట్టిన ఆడబిడ్డ. 1885 తర్వాత కాలం నుంచి వారింట్లో ఆడబిడ్డ పుట్టలేదు. ఈ విషయం తన భర్త చెబితే తెలుసుకున్న భార్య ఆశ్చర్యపోయింది. అయితే అండ్రి పుట్టకముందు కరవలిని రెండుసార్ల అబార్షన్ అయ్యాయి. ఇక రెండవ బిడ్డగా ఎవరు పుట్టినా సరే ఆరోగ్యంగా ఉంటే చాలని అనుకున్నారు. ఇక ఈ జంటకు ఆడపిల్ల పుట్టడంతో వీరి ఆనందానికి అవధులు లేవు. ఇంతవరకు మగ పిల్లల పేర్లు పెట్టిన ఆ కుటుంబం ఆడపిల్ల పుట్టడంతో పేరు పెట్టడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో వారు పెట్టడంతో వైరల్ గా మారింది.
Also Read: అయ్యో అల్లరి నరేష్ అలాంటి సినిమాని ఎలా మిస్ చేసుకున్నావయ్యా..!!