Advertisement
స్టీల్ ప్లాంట్ అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా బిడ్డింగ్ విషయంలో బీఆర్ఎస్ ఎంట్రీతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. అయితే.. ప్రైవేటీకరణ అంశంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యల తర్వాత.. పలువురు నేతలు బీఆర్ఎస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్రం వెనుకడుగు వేయడానికి కేసీఆరే కారణమని అంటున్నారు. వారిలో సీబీఐ మాజీ జేడీ, జనసేన మాజీ నేత వీవీ లక్ష్మినారాయణ కూడా ఉన్నారు.
Advertisement
ట్విట్టర్ లో కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు లక్ష్మినారాయణ. ‘‘శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు.. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఐఎన్ఎల్ ని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొనాలి’’ అని కోరారు.
Advertisement
అయితే.. లక్ష్మినారాయణ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్ని సమస్యలపైనా స్పందిస్తే బాగుంటుందని సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ పై ప్రేమ ఉంటే వాళ్ల పార్టీలో చేరండి తప్పులేదు.. కానీ, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
‘‘లక్ష్మి నారాయణ గారు, బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబం మీద మీకున్న ప్రేమ.. మీరు మీ అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చు. మాకు అభ్యంతరం లేదు. అయితే.. మీరు ఏపీ ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఏపీపై నీటిపారుదల అంశంలో కేసీఆర్ కుటుంబం కేసుల సంగతేంటి? ఏపీ పెండింగ్ సొమ్ము ఎంత? ఏందుకు చెల్లించడం లేదు? ఏపీ పోలీసులపై టీజీ పోలీసులు చేసిన దాడి ఏంటి? కేసీఆర్ నిజంగా ఏపీ శ్రేయోభిలాషి అయితే ఇలా చేసి ఉండేవారు కాదు. మీ రాజకీయాల కోసం ఏపీ ప్రజలను మీరు అవమానిస్తున్నారు’’ అని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.