Advertisement
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాని కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఐపీఎల్ లో కావ్య మారన్ పేరుకి ఉండే క్రేజ్ వేరు. ఆమె అందానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తెనే ఈ కావ్య మారన్. ఈమె సన్ నెట్వర్క్ లోని సన్ మ్యూజిక్ మరియు ఎఫ్ఎం ఛానల్ లను కూడా చూసుకుంటుంది. కావ్య 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 30 సంవత్సరాలు.
Advertisement
ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి లియోనార్డ్ ఎన్ స్టేర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ లో మాస్టర్ డిగ్రీ పొందారు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్ లలో సందడి చేస్తూ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది కావ్య. ఈమె కోట్ల విలువ చేసే వ్యాపారాలకి హెడ్ గా ఉన్నారు. క్రికెట్ తో పాటు ఎన్నో కోట్ల విలువ చేసే బిజినెస్ లు నిర్వహిస్తున్నారు కావ్య మారన్. మొట్టమొదటిసారిగా ఈమె గురించి తెలిసింది 2018 ఐపీఎల్ లోనే. అప్పుడు సన్ రైజర్స్ టీమ్ ని ప్రోత్సహిస్తూ టీవీలో కనిపించారు కావ్య. ఈమెకి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
Advertisement
ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కి హాజరవుతూ ఉంటారు. ఇక అప్పుడు కెమెరాలన్నీ ఆమె వైపే చూస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈమె బాధ్యతలు నిర్వహించే సన్ మ్యూజిక్ భారత్ లోనే తొలి 24 గంటల మ్యూజిక్ పే టెలివిజన్ ఛానల్. ఈ ఛానల్ కోలీవుడ్ లో చాలా ఫేమస్. వీటితోపాటు సన్ టీవీ నెట్వర్క్ ఓటిటి ప్లాట్ ఫామ్, సన్ నెక్స్ట్ హెడ్ కూడా ఈమెనే. దీనికి 20 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇక ఈమె నికర సంపాదన విషయానికి వస్తే.. రూ. 50 కోట్లు అని అంచనా. వీరి కుటుంబం తమిళనాడులోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి. వీరి సంపద సుమారు 40 వేల కోట్లు ఉంటుందని సమాచారం.
మరిన్ని ముఖ్యమైన అంశాలు !