Advertisement
భార్యాభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప బంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల బంధమే. రెండు మనుషులు ఒకటిగా మారి, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒకరిపై ఒకరు ప్రాణాలు పెట్టుకుని బ్రతికే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఇబ్బంది కలిగితే మరొకరు తల్లడిల్లిపోతారు. అప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా పెళ్లి తర్వాత భార్య తన పుట్టింటిని వదిలి మెట్టింట్లోకి అడుగుపెడుతుంది. భర్త కుటుంబమే తన కుటుంబం అనుకుంటుంది. అంతేకాకుండా భర్త కూడా తనను నమ్మి వచ్చిన భార్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు.
Advertisement
READ ALSO : స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం
అయితే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి రావడం సహజం. ఇలా చిన్నచిన్న గొడవలకే భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లి, విడిపోతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు ఇంట్లో భర్త లేని సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటంటే.. భర్త బయటకు వెళ్లిన తర్వాత భార్య ఫోన్లలో ఎక్కువగా మాట్లాడడం, లేదా చాటింగ్ లో బిజీగా ఉండడం లాంటివి చేయకూడదు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తులతో ఎలాంటి స్నేహ బంధాలు పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఇక భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవడం మంచిది కాదు. ముఖ్యంగా అబ్బాయిలను అస్సలు పిలవకూడదు.
Advertisement
ఈ విషయం భర్తకు తెలిస్తే కాపురం చెల్లాచెదురు అయ్యే అవకాశం ఉంది. ఇక భర్త రోజంతా కష్టపడి ఇంటికి వస్తే భార్య సీరియల్స్ చూస్తూ, ఇతరులతో టైంపాస్ చేస్తూ సమయం గడపకుండా.. అతడికి ఇష్టమైన భోజనం వండి పెట్టడం, అతడికి నచ్చిన విధంగా రెడీ అవ్వడం లాంటివి చేయాలని చెబుతున్నారు. భర్త ఇంట్లో లేని సమయంలో భార్యలు కాపురాన్ని చక్కదిద్దే లేదా భర్తతో సఖ్యతను పెంచే ఆలోచనలే చేయాలి. ఇక భర్త ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు అతడికి పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. అవసరం ఉంటేనే ఫోన్ చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నప్పుడు లేనిపోని ఆలోచనలు వస్తాయి కాబట్టి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. వీలైతే కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం