Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. అయితే ఈ చిత్ర పరిశ్రమలో ఇప్పటి తరం హీరోలు చాలామంది మంచి మంచి చదువులు చదివి చివరికి సినిమాల్లోకి వచ్చారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న మన హీరోలు ఎవరెవరు ఎంత చదివారో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్ నాగార్జున లాంటి సీనియర్ హీరోలు విదేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ హీరోగా మారిన సంగతి తెలిసిందే. నాగార్జున అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ పూర్తి చేశాడు.
Advertisement
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!
విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఉన్న మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. చిరంజీవి నరసాపురం లో ఉన్న వైఎం కాలేజీలో బీకాం డిగ్రీ పూర్తి చేశారు. సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించి తదనంతరం సినిమాల్లోకి ప్రవేశించారు. నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు. డాక్టర్ రాజశేఖర్ తమిళనాడులో పుట్టి తెలుగులో సినిమాలు చేసి హీరోగా ఉన్నారు డాక్టర్ అయినా ఆయన అనుకోకుండా యాక్టర్ అయ్యారు.
Advertisement
Also Read: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!
రాజశేఖర్ ఎంబిబిఎస్ చదువుకొని కొన్నాళ్లు డాక్టర్ గా పనిచేశారు. హీరో సాయిధరమ్ తేజ్ బయోటెక్నాలజీలో మన దేశంలోనే టాప్ యూనివర్సిటీ అయినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా లో స్పెషల్ క్లాసులు తీసుకున్నాడు.
నందమూరి తారక రామారావు డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లోనే ఎమ్మెస్సీ వరకు చదువుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వి ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ బాబు చెన్నై లయోలా కాలేజీలో కామర్స్ డిగ్రీ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్లు ఇంటర్మీడియట్ వరకు చదువగా రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో డిగ్రీ పూర్తి చేశారు. అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయగా, విజయ దేవరకొండ బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం చదువు పూర్తి చేశాడు.