Advertisement
ప్రస్తుతం దేశంలో చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రోడక్ట్లు జనాల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రచారం అవసరం. టీవీల్లో అలాగే పేపర్ ప్రకటన.. అనేక రకాలుగా తమ తమ ప్రాజెక్టులను జనాల్లోకి వదులుతారు కంపెనీ ఓనర్లు. దీనికోసం కొన్ని కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లను కూడా వాడుతుంది. అలా ఎయిర్టెల్ కంపెనీకి కూడా అప్పట్లో ఒక అమ్మాయి వచ్చేది.
Advertisement
అసలు వివరాలలోకి వెళితే…’ఇంతకంటే వేగంగా నెట్వర్క్ వస్తే లైఫ్ టైం మొబైల్ బిల్లు ఫ్రీ’ అంటూ టీవీలో చెప్పే అమ్మాయిని ఎయిర్టెల్ 4g అమ్మాయి అని కూడా పిలుస్తుంటారు. జనాలు ఈ నటి పేరు గుర్తు ఉండకపోవచ్చు, కానీ మీరు ఈ ముఖాన్ని మరిచిపోలేరు. ఎయిర్టెల్ 4g గర్ల్ అని పిలిచే ఈ అమ్మాయి సాషా… ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జన్మించింది. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాషా… ఆ తర్వాత ముంబై వెళ్లి అడ్వర్టైజింగ్ స్టడీ అభ్యసించింది. ఎయిర్టెల్ యాడ్ చేయడానికి ముందు సాషా ఏజెన్సీలో కాపీ రైటర్ ట్రైనీ.
Advertisement
Also Read:ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!!
ఈ యాడ్ కోసం ఆమెకు కాల్ వచ్చినప్పుడు ఫేక్ అని వదిలిపెట్టింది. కానీ ఆ తర్వాత 2015లో ఎయిర్టెల్ యాడ్ చేసింది సాషా. ఈ యాడ్ ద్వారా ఒక్కసారిగా సాషా ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా ఎయిర్టెల్ వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ యాడ్ తర్వాత ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలిసారిగా కత్తి బట్టి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. చివరిసారిగా ప్రభాస్ నటించిన రాధాశ్యామ్ చిత్రంలో కనిపించింది. అయితే ఎప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉండే ఆమె సైలెంట్ అయింది. సెప్టెంబర్ నుంచి సాషా ఇన్ స్టా లో మరో పోస్ట్ చేయలేదు.