Advertisement
మరోసారి ఐటీ దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. సినిమా ఇండస్ట్రీ పై ఆదాయపు పన్ను శాఖ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. బ్లాక్ మనీ ఫ్లోటింగ్ అయ్యేది ఇక్కడేనని అధికారుల అనుమానం. ఈ నేపథ్యంలోనే పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటి అధికారులు బుధవారం రైడ్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం తో పాటు సంస్థ ప్రతినిధులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.
Advertisement
Read also: రాజమౌళి, అయన భార్య రామా రాజమౌళి ఎందుకు పిల్లల్ని వద్దని అనుకున్నారంటే ?
Advertisement
ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ కారణాలతో పాటుగా ఈ రైడ్స్ జరగడానికి మరికొన్ని రీజన్స్ కూడా వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఆర్బిఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి నిధులు వచ్చినట్లు ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆర్బిఐ అనుమతి లేకుండా రూ. 500 కోట్ల పెట్టుబడులు అమెరికా నుంచి వచ్చినట్టు ఈడి అధికారులు గుర్తించారని సమాచారం. ఇది కాక ఈ సంస్థ ద్వారా ఓ ఇద్దరూ ఎమ్మెల్యేలు తమ అక్రమ సంపాదనను సినిమాలలో పెడుతున్నారు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు తెలంగాణకు చెందిన వారు అయితే.. మరొకరు ఏపీ ఎమ్మెల్యే అని సమాచారం.
ఇక 2017లో ఈ సంస్థను స్థాపించగా.. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది మైత్రి మూవీస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పుష్ప సినిమా. ఈ చిత్రాన్ని తీసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. అయితే పలు చిత్రాలతో వచ్చిన లాభాలను నిర్మాతలు రియల్ ఎస్టేట్ కి తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కిందటేడాది డిసెంబర్ లో కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై ఐటి దాడులు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఐటీ రైడ్స్ జరగడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
Read also: కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?