Advertisement
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, మంగరాజు రాజబాబు అముదాలవలస మండలం ఈసార్లపేట గ్రామం అతనికి 2016లో ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 2022 ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన మౌనికని ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు. రాజబాబు ప్రస్తుతం హరియాన రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక కూడా ఏడు నెలల గర్భిణీ. ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా రాజబాబు తండ్రి వైజాగ్ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు.
Advertisement
Advertisement
అనంతరం తన కొడుకుకు సమాచారం అందించారు. వెంటనే రాజబాబు సెలవు పెట్టి హరియానా నుంచి వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 16న తన భార్య మౌనిక లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. భార్య మరణాన్ని రాజబాబు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటినుంచి భోజనం మానేశారు. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. బాగా కృంగిపోయాడు. ఈ క్రమంలో రాజబాబు ఈనెల 19న ఆరోగ్యం బాగాలేదని.. ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పాడు.
ఆముదాలవలస వెళ్లి అక్కడి నుంచి రైలు ఎక్కి పొందూరు చేరుకున్నారు. తాను పొందూరులో ఉన్నానని, చనిపోతున్నానని స్నేహితులకు ఓ మెసేజ్ చేశారు. దీంతో ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు. వెంటనే పొందూరు పోలీసులకి సమాచారం అందించారు. అందరూ కలిసి పొందూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి కొంచాడ దగ్గర ఓ తోటలో రాజబాబు ఉరివేసుకొని కనిపించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కొడుకు, కోడలు ఇద్దరు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
READ ALSO : VIRUPAKSHA REVIEW TELUGU: సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్