Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా, మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కొంతమంది ఎదిగితే, కొంతమంది రాణించలేకపోతున్నారు. అయితే వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరిగాక నటి నటులు ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా, పలు చిత్రాల్లోని కొన్ని సన్నివేశాల వల్ల వివాదాలు వస్తూ ఉండటంతో వాటిని డిలీట్ చేసి మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న కొన్ని మూవీల గురించి తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : Anushka Shetty in Baahubali: “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రకి డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరంటే ?
# అర్జున్ రెడ్డి
రౌడీ హీరో విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా మార్చింది ఈ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ మూవీలో అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు కూడా. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
# సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్టు సైరా సినిమా గురించి కూడా వివాదాలు తెగ చుట్టుముట్టాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలా విషయాలు తెలుసుకొని వారికి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొనిదెల ఆఫీస్ దగ్గర, చిరు ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు.
# సర్కారు వారి పాట
ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మహేష్, కీర్తి సురేష్ ని బ్లాక్ మెయిల్ చేసి తన పక్కన పడుకోమని అడుగుతాడు. అప్పుడు ఆమెపై కాలు కూడా వేస్తాడు. ఈ సన్నివేశంపై వివాదాలు రావడంతో డైరెక్టర్ పరుశురామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అవి ఫలించలేదు.
# రంగస్థలం
చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలంపై కూడా ఓ వివాదం మొదలు అయింది. సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఎక్కడ చూసిన ఈ పాట మారుమ్రోగిపోతుంది. అయితే ఈ పాటలో గొల్లభామ వచ్చి గొల్లుగిల్లుతుంటే అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం డిమాండ్ చేశారు.
Advertisement
# దరువు
రవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది. దరువు అనేది తమ సాంస్కృతిలో భాగం అని తెలంగాణ సాంస్కృతి సంఘం వ్యతిరేకించింది. చివరకు వారిని నిర్మాత ఒప్పించి సినిమాని రిలీజ్ చేసుకున్నారు.
# రచ్చ
రామ్ చరణ్ రచ్చ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటలో గౌతమ బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించాలని మహిళా సంఘాలు రచ్చ చేశాయి. అందుకే ఆ పాటలో బుద్ధుడు కనబడకుండా రీ ఎడిట్ చేసి సినిమా రిలీజ్ చేశారు.
# దువ్వాడ జగన్నాథం
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం డీజే. అప్పట్లో ఈ మూవీపై ఎన్నో వివాదాలు వచ్చాయి. ఈ మూవీలో ఒక సీన్ లో అల్లు అర్జున్ గాయత్రి మంత్రం జపిస్తూ విలన్స్ తో ఫైట్ చేస్తాడు. ఆ టైములో అల్లు అర్జున్ కాళ్ళకి చెప్పులు ఉండటంపై పలు అభ్యంతరాలు వచ్చాయి.
# బెజవాడ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో, నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం బెజవాడ. ఈ మూవీకి మొదట బెజవాడ రౌడీలు అనే పేరు పెట్టారు. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం తెలపడంతో టైటిల్ లో రౌడీలు అనే పదాన్ని తొలగించారు.
# కృష్ణం వందే జగద్గురుమ్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీలో రానా హీరోగా నటించారు. ఈ మూవీ మొత్తం బళ్లారి మైనింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఒక ప్రముఖ పార్టీ లీడర్ ని ఈ మూవీలోని మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారు అని పొలిటికల్ పార్టీస్ చాలా గొడవ చేశాయి.
# కెమెరామాన్ గంగతో రాంబాబు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు వివాదం సృష్టించారు. కానీ ఈ మూవీ అలాగే రిలీజ్ అయింది.
READ ALSO : ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?