Advertisement
ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది. శాఖాహారమా… లేక మాంసాహారమా… అంటే చాలామంది శాఖాహారం అని బల్లగుద్ది మరీ చెబుతారు. కొందరు మాత్రం మాంసాహారం కూడా ఆరోగ్యానికి మంచిదే అంటారు. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మాంసకృతులు బి-12 లాంటి కొన్ని విటమిన్స్ మాంసాహారం లోనే ఎక్కువగా దొరుకుతాయని, మాంసాహారం తింటేనే మనిషి బలంగా తయారవుతాడని అంటారు. వీటిలో దేన్ని నమ్మాలి అనే దానిపై అస్సలు క్లారిటీ ఉండదు. అయితే సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తింటే అసలు మంచిది కాదా…? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
Advertisement
ఒకప్పుడు బ్రాహ్మణులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. జనాలు ఎక్కువగా మాంసాహారానికి అలవాటు పడిపోయారని, అది హానికరమని భావిస్తూ అందరూ కచ్చితంగా శాఖాహారం మాత్రమే తినాలని తీర్మానించారు. కానీ దీనికి చాలామంది ఒప్పుకోలేదట. అయితే కనీసం సోమ, మంగళ, గురు, శనివారాల్లో అయినా మాంసాహారం మానేయమని, అలా చేస్తే ఆ రోజుల్లో పూజించే దైవాలు అనుగ్రహం లభిస్తుందని చెప్పారు.
దీంతో ఆ రోజుల్లో నాన్ వెజ్ తినడం మానేశారు జనాలు. ఇక దీనికి ఉన్న ఇంకో కారణం ఏమిటంటే… మాంసాహారం తామస ఆహారం. అంటే ఒంట్లో కామాన్ని, కోరికలను పెంచుతుంది. దీంతో మనుషులు వాటి బారిన పడి ఉచ్చ నీచాలను మరిచిపోతారు. చేయకూడని పనులు చేస్తారు. వ్యక్తిగత నియంత్రణ ఉండదు. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు సెల్ఫ్ కంట్రోల్ కోసం జనాలు ఆయా రోజుల్లో నాన్వెజ్ తినడం మానేశారు.
READ ALSO : టాలీవుడ్ భామలు తమ మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో తెలుసా ?