Advertisement
Good Morning Quotes and Images in Telugu : గుడ్ మార్నింగ్.. మనం ఉదయాన్నే లేవగానే అందరికీ చెప్పే మొదటి పదం ఇదే. అలాగే ప్రతిరోజు మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మన మొబైల్ లోని వాట్సప్ స్టేటస్ లో లేదా గుడ్ మార్నింగ్ Good Morning Wishes Telugu కి సంబంధించిన ఇమేజ్ లని ఇతరులకు పంపించడం లేదా ఇతరులు పంపించిన కొటేషన్స్ ని చదవడం వంటివి చేస్తూ ఉంటాం. ఇలా శుభోదయం కి సంబంధించిన కొన్ని కొటేషన్స్ మరియు ఇమేజ్ లని ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: Nammakam Quotes in Telugu: నమ్మకంపై కొటేషన్స్
Good Morning Quotes and Images in Telugu గుడ్ మార్నింగ్ కొటేషన్స్
- జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి.. అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం – శుభోదయం.
- జీవితం ఒక యుద్ధ భూమి.. ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఊరికే ఉంటే ఏముంటుంది – శుభోదయం.
- విజయం సాధించాలంటే మొదట చేయాల్సిన పని చేసే పనిని ప్రేమించడమే – శుభోదయం
- ఆశ మనిషిని బతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది – శుభోదయం.
- నువ్వు నా పక్కన లేనంత మాత్రాన నేనెప్పుడూ ఒంటరిలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే.. నువ్వు నా మనసులో ఉన్నావు.. ఎప్పటికీ ఉంటావు కూడా – శుభోదయం
- ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది.. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది – శుభోదయం.
- సంతోషాన్ని మించిన సంపద లేదు.. ఆనందాన్ని మించిన ఆస్తి లేదు. అందుకే ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా ఉండాలి – శుభోదయం.
- పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో.. మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది – శుభోదయం.
- జీవితం ఒక యుద్ధ భూమి.. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది.. ఊరికే నిలబడితే భూమి మీద ఓటమి తప్పదు – శుభోదయం.
- ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం ఒకటే.. అదే మీ చిరునవ్వు – శుభోదయం.
- మనిషిక కలిగే కష్టాలు రెండే రెండు.. ఒకటి నిన్ను బాధించేది.. మరొకటి నిన్ను మార్చేది – శుభోదయం.
- ఒక ఆశ మనిషిని బతికిస్తుంది. ఇష్టం అనేది మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరం అనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది – శుభోదయం.
- దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం కచ్చితంగా ఉంటాడు – శుభోదయం.
- బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది.. అది ఉన్నవారు విజయాన్ని సాధించగలరు – శుభోదయం.
- అహం వల్ల ఏర్పడే అంధకారం కారు చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి – శుభోదయం.
- నీవు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే.. మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు – శుభోదయం.
- చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్లని.. చేయి పట్టుకొని నడిపించే వాళ్ళని ఇప్పటికీ మరువకూడదు – శుభోదయం.
- గడిచిన నిన్నటిని నీ నిద్రతో పాటే వదిలేయ్.. జరగాల్సిన ఈ రోజుని నీ స్నేహితులతో ముందుకు సాగించు – శుభోదయం.
- నేను ఉదయం నుండి నీ గుడ్ మార్నింగ్ కోసం వేచి చూస్తున్నా.. కానీ ఇప్పటిదాకా నువ్వు ఇంకా నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు – శుభోదయం.
- నా యొక్క బంధుమిత్రులందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్.
- పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో.. మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది – శుభోదయం.
- తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావ్.. తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావ్.. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం – శుభోదయం.
Good Morning Images in Telugu
Advertisement
Positive Good Morning Quotes in Telugu
Read also: Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!