Advertisement
Telangana EAMCET Hall Ticket Download: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏప్రిల్ 30న ఈ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. TS EAMCET 2023 కు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. దరఖాస్తు గడవు ఏప్రిల్ 10నే గడువు ముగియగా… రూ. 5000 ఆలస్య రుసుముతో మే రెండు వరకు దరఖాస్తు అవకాశం ఉంది.
Advertisement
TS EAMCET 2023 పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్లో ఇంటర్, సీబీఎస్ఈ, ఐసిఎస్ ఈ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ’ ని… రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది’కీ’ని వెల్లడించి ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు. తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల కోసం https://eamcet.tsche.ac.in/ ను సంప్రదించండి.
READ ALSO : ఒక రాష్ట్ర సీఎం నే తెలివిగా బురిడీ కొట్టించిన ఘనుడు ఈయన ! ఎలా సీఎం నే ఎలా మోసం చేసాడంటే ?