Advertisement
ప్రేమలో పడిపోవడం అంటే సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం. ఒక్కోసారి ప్రేమలో పడ్డాక చాలామందికి అది స్వచ్ఛమైన ప్రేమా..? లేదంటే అట్రాక్షన్ ఆ అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇక ప్రేమ విషయంలో అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నిజాయితీగా ఉండాలి. ఏదో టైం పాస్ కోసం ప్రేమించినట్లు నటించడం, తర్వాత వదిలేయడం వంటివి చేయకూడదు.
Advertisement
Read also: ఈ సినిమాలు చేసి ఉంటే ఉదయ్ కిరణ్ తిరిగి నిలదొక్కుకునేవాడు!
ప్రేమలో నమ్మకం అనేది అవసరమే.. అలాగే జాగ్రత్త తీసుకోవడం, ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో అంచనా వేయడం కూడా అత్యవసరం. అయితే మీరు పక్కన ఉండగానే మీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిలను ఫ్లర్ట్ ( సరసాలు) చేస్తున్నాడా..? ” ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురైతే వెంటనే రియాక్ట్ కాకూడదు. దీనివల్ల మీ మధ్య అనుబంధం చెడిపోయే అవకాశం ఉంది. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ అలా చేయకుండా ఉండడానికి ఈ టిప్స్ ని పాటించండి..
Advertisement
* మీరు పక్కన ఉండగానే మరొక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తున్న ప్రతి బాయ్ ఫ్రెండ్ చీటర్ కాదనే విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఫ్లర్టింగ్ అవతలి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
* ఇలా మీ బాయ్ ఫ్రెండ్ ఇతరులని ప్లర్ట్ చేస్తున్నప్పుడు కాస్త కష్టమైన ఓపికగా ఉండి.. సమయం వచ్చేంత వరకు వేచి చూసి ఈ విషయం మీద కూల్ గా చర్చించాలి. గొడవగా మాట్లాడితే మీ మధ్య అనుబంధం చెడిపోయే అవకాశం ఉంది.
* ఇలాంటి విషయాల గురించి చర్చించినప్పుడు మీరు అతన్ని ఎంత నమ్ముతున్నారు అనేది తెలిసేలా చేయాలి. మీ నమ్మకం అతనికి తెలిస్తే.. అతని ఆలోచనలలో మార్పు రావచ్చు.
* కమ్యూనికేషన్ గ్యాప్ ఏ బంధంలో అయినా ఇబ్బంది పెట్టేదే. అందుకే అనవసరమైన చర్చలకు ఆస్కారం ఇచ్చేలా మీ కమ్యూనికేషన్ ఉండకూడదు. చర్చించుకుంటే ముగిసిపోయే దానికి అరుపులు, కేకల వరకు తెచ్చుకోకూడదు అని సూచిస్తున్నారు నిపుణులు.
Read also: పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తారు ? దాని వెనకున్న కారణం ఇదేనా ?