Advertisement
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’ తో కొరియోగ్రాఫర్ గా మంచిపేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఆదివారం రాత్రి సూ*డ్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మ**త్య చేసుకుంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు చైతన్య మాస్టర్. తనకు అప్పులు ఎక్కువ అయ్యాయని, అవి తీర్చే సత్తా ఉన్నా మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆ వీడియోలో చెప్పాడు.
Advertisement
Read also: పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!
ఇక ఢీ పేరుతో పాటు పాపులారిటీ ఇస్తుంది కానీ సంపాదన అనుకున్నంత ఇవ్వదంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు. అప్పులపోరు తట్టుకోలేకే తాను సూ*డ్ చేసుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే చైతన్య ఆత్మత్యపై కండక్టర్ ఝాన్సీ చేసిన వాక్యాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గత ఏడాది డిసెంబర్ 31న కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో కొంత మంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండ్ ఇచ్చారని, దీంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ ను ఆపేసారని, దానివల్ల ఆయన అప్పు చేశారని పేర్కొంది.
Advertisement
దాన్ని తీర్చేందుకు మరో అప్పు, ఇలా అప్పులు చేసుకుంటూ పోయారని చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారంటూ కండక్టర్ ఝాన్సీ కన్నీళ్ళ పర్యంతం అయింది. ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ ఆర్టిస్టులతో కూర్చొని మాట్లాడి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఝాన్సీ అభిప్రాయపడింది. మొత్తానికి ఝాన్సీ చేసిన వాక్యాలతో చైతన్య సూ*డ్ వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి.