Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. చాలామంది మిత్రులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న స్టార్లలో ఎవరికి ఎవరు బంధువులు ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1 రామ్ పోతినేని, శర్వానంద్
రామ్ పోతినేని కి శర్వానంద్ బావ వరసావుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.
#2 సందీప్ కిషన్, చోటా కె నాయుడు
టాలీవుడ్ లో చోటా కె నాయుడు గారి కెమెరా పనితనం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలని చాలా బాగా చూపిస్తారని పేరు ఉంది. అయితే చోటా కె నాయుడుకి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ హీరోగా నటించిన చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.
#3 నాగార్జున, వెంకటేష్
వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ గారు నాగార్జున గారు మాజీ దంపతులు. వీరి కుమారుడు నాగచైతన్య, వెంకటేష్ నాగార్జునలు సొంత బావమరుదులు. కొన్ని కారణాలవల్ల నాగార్జున మొదటి భార్యతో విడాకులు అయినప్పటికీ వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
Advertisement
#4 నగ్మా, జ్యోతిక
ఒకప్పటి అందాల తార నగ్మా, తమిళ్ హీరోయిన్ జ్యోతిక లు అక్క చెల్లెల్లు. జ్యోతిక నగ్మా కి స్టెప్ సిస్టర్.
#5 గోపీచంద్, శ్రీకాంత్
తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ కి హీరో గోపీచంద్ దగ్గర బందువే, గోపీచంద్ శ్రీకాంత్ గారి మేనకోడల్ని వివాహం చేసుకున్నాడు.
#6 కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి
దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి, కీరవాణి ఇద్దరు అన్నదమ్ములే, కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి. రాజమౌళి గారు తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణి గారు.
#7 ప్రకాష్ రాజ్, శ్రీహరి
ప్రకాష్ రాజ్, శ్రీహరి గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. వీరిద్దరూ తెలుగు సినిమా ప్రేక్షకులు గుర్తిండి పోయే క్యారెక్టర్లు చేశారు. ప్రకాష్ రాజు గారి మొదటి భార్య, శ్రీహరి గారి భార్య సొంత అక్క చెల్లెలు.