Advertisement
జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. మనలో చాలామంది జీడిపప్పును ఎంతో ఇష్టంగా తింటారు అనే విషయం తెలిసిందే. ఈ జీడిపప్పు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు, ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు జీడిపప్పు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. ఇక జ్ఞాపకశక్తి పెరగాలని చూసేవారు, మెదడు యాక్టివ్ గా, చురుకుగా మారాలని అనుకునేవారు ఈ పప్పును ఉదయం పరగడుపున తినాల్సి ఉంటుంది. 4 జీడిపప్పులను ఉదయం పరగడుపున తినాలి.
Advertisement
Read also: మొండిగా ఉన్న మీ భార్యని ఇలా దారిలోకి తెచ్చుకోండి!
తరువాత వెంటనే ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా ఒక నెలలో 15 రోజులపాటు చేసి.. మరో 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇక జీడిపప్పులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. అలాగే జీడిపప్పును పరగడుపున తినడం వల్ల మెమొరీ పవర్ పెరగడమే కాదు.. జీర్ణాశయంలో ఆసిడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇలా తినడం మంచిది. జీడిపప్పు లోని పోషకాలు కంటి రెటీనాను రక్షిస్తాయి. కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Advertisement
సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుండి కళ్ళు సురక్షితంగా ఉంటాయి. జీడిపప్పులో లుటీస్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. జీడిపప్పును రక్త పోటు ఉన్న వాళ్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి బీపీ ఉన్నవాళ్లు తినవచ్చు. అందువల్ల పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు జీడిపప్పును తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వైద్య నిపుణుల సైతం రోజు జీడిపప్పును తీసుకుంటే మంచిదని సూచనలు చేస్తున్నారు.
Read also: నటి శాలిని విడాకుల ఫోటోషూట్ వెనుక ఇంత విషాదం దాగి ఉందా..!!