Advertisement
గోరింటాకు అంటేనే ఆడపిల్లలకు ఒక అలంకార ప్రాయం.. గోరింటాకు పెట్టుకుని అది బాగా పండితే ఆడపిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. ఏ పండగ అయినా ఆడపిల్లలు ముందుగా గోరింటాకు పెట్టుకుని అలంకరించుకుంటారు. పెళ్లిళ్లు ఇతరాత్రా ఏవైనా ఫంక్షన్లకు అయితే ఈ మెహందీ డిజైన్ సపరేట్ గా ఉంటుంది. అంటే భారతీయులలో గోరింటాకు అంటే ఎంతటి ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి గోరింటాకు ఎక్కడ పుట్టింది. దాని వల్ల కలిగే లాభాలు.. చరిత్ర చూద్దాం..?
Advertisement
Also Read: భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్ళే…
మన భారతదేశంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వ కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆషాడ మాసం అంటేనే వానలు ఎక్కువగా పడుతుంటాయి. ఈ వర్షాల వల్ల అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలుతాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు ఎక్కువగా నీటిలోనే పని చేస్తూ ఉంటారు కాబట్టి. అందుకే వారు చేతికి గోరింటాకు వేసుకోవడం వలన చేతుల ద్వారా సూక్ష్మజీవులు, ఇతర అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే గర్భిణీ స్త్రీలు గోరింటాకు తినడం వల్ల ఒంటిలోని వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. గోరింటాకు ముద్దను తినడం వల్ల గర్భాశయ దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.
Advertisement
గోరింటాకు పుట్టుక :
గోరింటాకును గౌరీ దేవి ప్రతికగా చెబుతారు. అంటే గౌరీ ఇంటి ఆకు.. ఇది రానురాను గోరింటాకు గా మారింది. మరి దీని వెనుక కథ ఓ సారి చూద్దాం.. గౌరీ దేవి బాల్య దశలో ఉన్నప్పుడు తన చెలికత్తెలతో వనంలో ఆడుతుండగా రజస్వల అవుతుంది. ఆ సందర్భంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగా అక్కడ మొక్క ఉద్భవిస్తుంది. దీన్ని చూసిన చెలికత్తెలు వెంటనే వెళ్లి పర్వతరాజుకు చెబుతారు. దీంతో పర్వతరాజు దంపతులు వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దది అవుతుంది. ఆ మొక్కను గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో చెట్టు ఆకులు కోస్తుంది. దీంతో గౌరీ దేవి వేళ్ళు ఎర్రబడిపోతాయి. అది చూసినటువంటి పర్వతరాజు దంపతులు అయ్యో బిడ్డ చేతు కంది పోయింది అని అనుకునే లోపే, గౌరీ దేవి నాకు ఏం కాలేదు ఆ రంగు మంచి అలంకరణగా ఉంది అని చెబుతోంది. దీంతో పర్వతరాజు గోరింటాకు స్త్రీ సౌభాగ్యానికి ప్రత్యేకమైన చిహ్నంగా ఉంటుందని తెలియజేశారు. దీంతో అప్పటి నుంచి గోరింటాకు ప్రసిద్ధి లోకి వచ్చేసింది.
Also read: భర్త చనిపోయిన రెండవ రోజే మీనా అలాంటి నిర్ణయం తీసుకున్నారా ?