• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » భర్త చనిపోయిన రెండవ రోజే మీనా అలాంటి నిర్ణయం తీసుకున్నారా ?

భర్త చనిపోయిన రెండవ రోజే మీనా అలాంటి నిర్ణయం తీసుకున్నారా ?

Published on July 4, 2022 by Bunty Saikiran

Advertisement

నటి మీనా నిన్నటి తరం హీరోయిన్స్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్యారెక్టర్ నచ్చితే చాలు కచ్చితంగా ఆమె సినిమా చేసేవారు.1982 చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా అప్పటి నుంచి చాలా లాంగ్వేజ్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె దాదాపు 45 సినిమాల వరకు చేసింది. మీనా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్న విద్యాసాగర్ ను పెళ్లాడింది. అంతేకాదు, పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతలోనే మీనాకు ఒక కూతురు పుట్టింది. తన కూతురు నైనిక పుట్టిన తర్వాత కూడా చాలా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ కూతురు ఉందని వాటన్నింటినీ పక్కన పెట్టింది. సరిగ్గా అదే టైం లో తన భర్త మాత్రం మీనా ను ఆర్టిస్ట్ గా ఎంకరేజ్ చేశాడు.

Actress Meena and Vidyasagar

Also read: కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాడంలో ఎందుకు దూరంగా ఉండాలి..?

Actress Meena and Vidyasagar

Actress Meena and Vidyasagar

Also read: ప్రకాష్ రాజ్ నుంచి సోను సూద్ వరకు విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Advertisement

నువ్వు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ వి. ఈ సినిమా ఫీల్డ్ ని పక్కన పెట్టవద్దు అంటూ తన కూతురు బాగోగులు తనే చూసుకుంటాను అంటూ, భరోసా ఇచ్చి మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేలా సహకరించారు. ఈ విధంగా మళ్లీ ఆమె సపోర్టింగ్ ఆర్టిస్టుగా కీలక పాత్రలో చేస్తూ వస్తోంది. దృశ్యం లాంటి సినిమాలతో మీనా అద్భుతాలు చేసింది. భర్త ప్రోత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్న మీనా, తనతోపాటు తన కూతురు నైనికను కూడా తన వెంట తీసుకు వెళ్ళేది. తన భర్తకు ఇబ్బంది లేకుండా షూటింగ్స్ ప్లాన్ చేసుకునేది. ఇక కెరీర్ మళ్ళీ గాడిన పడుతుంది అనుకున్న సమయంలో తన భర్త ఆకాల మరణం చెందడంతో మీనా కోలుకో లేకుండా ఇబ్బందుల్లో పడిపోయింది.

Actress Meena and Vidyasagar

Actress Meena and Vidyasagar

దాంతో ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపై సినిమాలు చేయకూడదని మీనా నిర్ణయించుకున్నారట. ఇంతకాలం నుంచి తన భర్త తన కూతుర్ని చూసుకున్నారు. ఇక తన భర్త లేడు కాబట్టి తన కూతురికి నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా అన్ని తానే చూసుకోవాలని అనుకుంటుందట. అందుకోసమే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీనా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులన్ని త్వరగా పూర్తిచేసి ఇకముందు ఏ ప్రాజెక్టుకు సంతకం చేయనని మీనా సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అంత షాక్ కు గురవుతున్నారు. సినిమాలు చేస్తేనే ఈ బాధ నుంచి కాస్తయినా రిలీఫ్ ఉంటుంది అంటూ చాలామంది సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. మరి మీనా ఏ నిర్ణయానికి కట్టుబడుతుందో చూడాలి మరి.

Advertisement

Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd