Advertisement
హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే వెంకటేష్ భార్య గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు.
Advertisement
వెంకటేష్ పెళ్లి కోసం రామానాయుడు సంబంధాలు చూసినప్పుడు డబ్బు, కులం పట్టింపు లేకుండా అమ్మాయి గుణగణాలకే ప్రాముఖ్యతను ఇచ్చి చాలా సంబంధాలను చూశారట. ఆ సమయంలో టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్డిగారు ఒక సంబంధం చెప్పారట. నాగిరెడ్డి గారి బంధువు మదనపల్లెకు చెందిన సుబ్బారెడ్డి గారి అమ్మాయి నీరజ గురించి రామానాయుడుకి చెప్పారట. ఆ సంబంధం రామానాయుడు, వెంకటేష్ లకు నచ్చటంతో 13 డిసెంబర్ 1987న నీరజను వివాహం చేసుకున్నారు వెంకటేష్.
Advertisement
చెన్నైలో విజయ శేష మహాల్ లో వెంకటేష్, నీరజల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి సినీ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరు అయ్యి దంపతులను ఆశీర్వదించారు. ఇక నీరజ తల్లి సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ నీరజ తల్లిగారు వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. జీవితం ఆనందంగా ఉండాలంటే డబ్బు, హోదా కంటే పద్ధతి, అనుకువ ఉండాలని అర్థం చేసుకున్న రామానాయుడు వెంకటేష్ కి నీరజను ఇచ్చి వివాహం చేశారు. ఇక నీరజారెడ్డి పేరుపై కోట్లలో ఆస్తులు ఉన్నాయట. ఆమె సైలెంట్ తన వ్యాపారాలను చూసుకుంటుందని టాక్.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు: