Advertisement
The story of beautiful girl review in Telugu: మంత్ర సినిమా రచయిత రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో జెన్ నెక్స్ట్ ప్రొడక్షన్ రూపొందించిన తాజా చిత్రం ” ఏ స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ “. జెన్ నెక్స్ట్ ప్రొడక్షన్స్ ఛార్మితో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై వంటి కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించింది. ఇప్పుడు మరో వినూత్నమైన కథతో “ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్” అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రసాద్ తిరువళ్లూరి, పుష్యమి ధవలేశ్వరవులు సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, ద్రుషిక చందర్ హీరోయిన్ తో పాటు సీనియర్ నటుడు మధు నందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ అలాగే ప్రముఖ జర్నలిస్టు దేవీ నాగవల్లి, మహేష్ శ్రీరామ్ తదితరులు నటించారు. మే 12న (నేడు) ఈ మూవీ రిలయన్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: NAGA CHAITANYA CUSTODY REVIEW IN TELUGU: నాగచైతన్య “కస్టడీ” సినిమా రివ్యూ & రేటింగ్
కథ మరియు వివరణ:
Advertisement
డాన్సర్ చరిత్ర ( దృషిక చందర్) కిడ్నాప్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. చరిత్ర కిడ్నాప్ అయ్యిందనే వార్త విని రవి ( నిహాల్ కోదాటి) టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ స్థానిక సీఐ బాషా ( మధు నందన్ ) ఈ కేసు పై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ కేసు పెద్దది కావడంతో ఢిల్లీ నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య ఐపిఎస్ ( భార్గవ పోలుదాసు) రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలో చరిత్ర ఫ్రెండ్ అయిన రవిని విచారించగా.. వారి మధ్య ఉన్న లవ్ స్టోరీని బయటపెడతాడు రవి. అయితే చరిత్ర కిడ్నాప్ కి ముందు రోజు ఏం జరిగింది..? ఆమెని ఎవరు కిడ్నాప్ చేశారు..? అసలు చరిత్ర ప్రాణాలతోనే ఉందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్”. ఈ మూవీలో ముఖ్యంగా నిహాల్, దృషిక వారి నటనతో సినిమాని భుజాలపై మోసారని చెప్పవచ్చు. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా భార్గవ పోలుదాసు బాగా నటించారు. జర్నలిస్టు వైజయంతిగా దేవీ నాగవల్లి తన పాత్రలో మెప్పించింది. గిడియన్ కట్టా సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. కొంత ఎంటర్టైన్మెంట్ వైపు ఫోకస్ పెడితే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది. చిన్న సినిమా అయినా చాలా క్వాలిటీతో తెరకెక్కించారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
బిజిఎం
రేటింగ్: 2.5/5
Read also: NEWSENSE WEB SERIES REVIEW న్యూసెన్స్ రివ్యూ & రేటింగ్