Advertisement
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండు రోజుల కిందట విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. గతంలో జరిగిన పొరపాట్ల రీత్యా అత్యంత జాగ్రత్తగా ఫలితాలను విడుదల చేశారు. తాజాగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫస్టియర్ లో 68 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, 56.82 శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్ లో 73.46% మంది అమ్మాయిలు, 60.66% మంది అబ్బాయిలు పాస్ అయ్యారు.
Advertisement
READ ALSO : “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్” సినిమా రివ్యూ & రేటింగ్
Advertisement
ఇది ఇలా ఉండగా, అటు తమిళనాడులోని సోమవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో దిండిగల్ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ కూతురు ప్రభంజనం సృష్టించింది. నందిని అనే అమ్మాయి అన్ని సబ్జెక్టుల్లో 600కు 600 మార్కులు సాధించి సత్తా చాటింది. ఆమెకు తమిళ్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇలా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి.
దీనిపై ఆనందం వ్యక్తం చేసిన నందిని భవిష్యత్తులో ఆడిటర్ కావాలనేదే తన లక్ష్యమని తెలిపింది. అయితే ఈ 12వ తరగతి పరీక్షలకు తమిళనాడు వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 94.03% ఉత్తీర్ణతతో విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలకు 96.38%, అబ్బాయిలు 91.45 శాతంతో పాసయ్యారు. చాలామంది విద్యార్థులు తమిళ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 100 మార్కులు సాధించారు.
READ ALSO : ADIPURUSH MOVIE DIALOGUES TELUGU AND ENGLISH ఆదిపురుష్ డైలాగ్స్