Advertisement
అర్జున్ రెడ్డి సినిమా సమయంలో అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య మొదలైన వీరి గొడవ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉంది. అనసూయ కూడా పరోక్షంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లతో విరుచుకుపడుతుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ను తాజాగా చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Read also: మొండిగా ఉన్న మీ భార్యని ఇలా దారిలోకి తెచ్చుకోండి!
ఈ పోస్టర్ పై అనసూయ కామెంట్ చేసి…ట్రోలింగ్ కు గురైంది. అటు విజయ్ దేవరకొండపై అనసూయ పోరాటం ఆగేలా లేదు. తాజాగా ఘాటైన వాక్యాలు చేశారు. ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో అనసూయ సుదీర్ఘ హెచ్చరిక సందేశం పోస్ట్ చేశారు. అనసూయ పోస్ట్ పరిశీలిస్తే… నువ్వు చేసిన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను. దీని వలన నేను మరింత వ్యతిరేకత ఎదురుకుంటాను. అయినా నేను తగ్గను. నువ్వు చేసిన దాని నుండి తప్పించుకోలేవు. నాకు న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉంది.
Advertisement
ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని సింపతి పొందడానికి నేను మోసగత్తెను కాదు. నేను అలా చేయను. మీరు ఎంత కిందకు లాగినా, బురద చల్లినా నేను ఈ పోరాటం ఆపను. ఈ వివాదంలో ఎవరు తప్పో ఎవరు ఒప్పో తెలుసుకునే రోజు వస్తుంది. నాకు నమ్మకం ఉంది. ఎస్ నేను అటెన్షన్ కోరుకుంటున్నాను. కానీ మీరు అనుకున్నట్లు కాదు.
నా వర్క్, టాలెంట్ నాకు అటెన్షన్ తెచ్చిపెడతాయి. దానికి నేను అర్హురాలిని. అటెన్షన్ కోరుకోవడం నా వృత్తిలో భాగం. అలా అని నాకు పని లేదు, అందుకే అటెన్షన్ ఉంటుందని అనుకోకుండని పేర్కొంది. అనసూయ తాజా పోస్ట్ చూస్తే ఆమె ఈ వివాదంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేరని అర్థమవుతుంది.
Read also: నటి శాలిని విడాకుల ఫోటోషూట్ వెనుక ఇంత విషాదం దాగి ఉందా..!!