Advertisement
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. ప్రస్తుతం ఈ పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు. వధువు కానీ వరుడు కానీ చేసుకునే జీవిత భాగస్వామి వారి లైఫ్ సెట్ అవుతుందా లేదా అనేది ప్రత్యేకంగా చూసుకొని మరీ ఓకే చెబుతున్నారు. ఏదో పూర్వకాలం లాగ పెద్దలు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేసే విధంగా ఇప్పుడున్న యువత అయితే లేరు. వారికంటూ ప్రత్యేకమైన కోరికలు, కలలు, అలవాట్లు ఉంటున్నాయి. పెళ్లి విషయంలో వారి అభిప్రాయాలను మొహమాటం లేకుండా తల్లిదండ్రులకే కాదు చేసుకోబోయే భాగస్వామి కి కూడా చెబుతున్నారు. వీరి డిమాండ్లకు తలొగ్గితేనే పెళ్లి లేదంటే బ్యాచిలర్ గా ఉండాల్సిందే.
Advertisement
మొహమాటానికి పోయి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి వచ్చిన ఆడపిల్లలు ఒకవేళ వరుడు నచ్చకపోతే పెళ్లి పీటల మీద వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు. అలాంటి ఓ సంఘటన బీహార్లో తాజాగా చోటుచేసుకుంది.. ఇంకా కొద్దిసేపట్లో మూడు ముళ్ళు పడతాయి అనే టైంలో పెళ్ళికొడుకు నచ్చలేదని వివాహాన్ని క్యాన్సల్ చేయించింది వధువు. ఈ ఘటన బీహార్ లోని భాగల్పూర్ లో కహాల్గావ్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే వినోద్ మండల్ కూతురు కిట్టు కుమారికి డాక్టర్ వీరేంద్ర సింగ్ కొడుకు నీలేష్ కుమార్ సింగ్ తో వివాహం కుదిరించారు..
Advertisement
పెళ్లికి ముందు అతన్ని చూడలేదు. పెళ్లి తంతులో భాగంగా ఊరేగింపుగా వివాహ వేదిక పైకి వచ్చిన వరుడుని చూసిన వధువు మొహం ఒక్కసారిగా మారిపోయింది. వరుడు మెడలో దండ వేసి, తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ఎంత చెప్పినా వినలేదు. తనకంటే పెద్ద వయసులా కనిపిస్తున్నాడని, చాలా నల్లగా ఉన్నాడని యువతి డైరెక్టుగా రిజెక్ట్ చేసింది. వివాహానికి కూడా రద్దు చేశారు పెద్దలు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: