Advertisement
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో మోసాలు చేయడం ఎక్కువైపోయింది. పూర్వకాలంలో ప్రేమ అంటే ఏదో జాతర్లలో పెద్ద పండుగలో మాత్రమే చూసుకొని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని జీవితకాలం కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు స్కూల్ ఏజ్ లోనే ప్రేమ అంటూ తిరిగి అన్ని పనులు కానిచ్చేసి చివరికి బోర్ కొట్టాక వదిలేస్తున్నారు.
Advertisement
అలా ఇద్దరు లవ్ చేసుకుని ఏళ్ల తరబడి తిరిగి బ్రేకప్ లు చెప్పుకోవడంతో అందులో కొంతమంది ప్రేమికులు మనస్థాపానికి గురై వివిధ రకాల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలా ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులకు లోకానికి దూరమైంది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. నావి పేట మండల కేంద్రానికి చెందిన హరిణి (25) అదే గ్రామానికి చెందిన అక్థర్ లవ్ చేసుకున్నారు. ఏడు సంవత్సరాల పాటు కలిసి తిరిగారు. ఈ మధ్యకాలంలోనే హరిణి పెళ్లి విషయమై అక్తార్ మీద ఒత్తిడి తెచ్చింది. గట్టిగా నిలదీసింది.
Advertisement
దీంతో ఆయన పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పారు. దీంతో హరిణి మనస్థాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రాణాలు తీసేసుకుంది. కాసేపటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు పెట్టి ఉండడం గమనించారు.. ఎంత పిలిచిన హరిణి పలక పోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి హరిణి ఫ్యాన్ కు వేలాడుతోంది. దీంతో తల్లిదండ్రులు కుప్పకులారు. హరిణి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నావిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరికొన్ని ముఖ్య వార్తలు: