Advertisement
బెంగుళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు పోయాయి. ఆమె ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. ఆయన ఒక్క నిమిషం ఆగి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.. అయితే అసలు విషయాలు ఏంటో చూద్దామా.. కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అయితే బెంగళూరు చూడాలని ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరారు.
Advertisement
వీరు కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్దకు చేరుకోగానే అక్కడికి వర్షం నీరు భారీగా చేరింది. ప్రమాదాన్ని అంచనా వేసి ఆ కార్ డ్రైవర్ ఆగి ఉంటే సరిపోయేది. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఏం కాదు అన్నట్టు ముందుకు వెళ్లాడు. కారు అండర్పాస్ మధ్యలోకి రాగానే నీటిలో మునిగింది. ప్రమాదాన్ని గమనించిన భానురేఖ కుటుంబ సభ్యులు, సాయం కోసం ఎదురు చూశారు. ఈలోపు కొంతమంది గమనించి చీర తాళ్ల సహాయంతో కుటుంబ సభ్యులను కాపాడారు.
Advertisement
కానీ అప్పటికే భాను రేఖ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన కారణం క్యాబ్ డ్రైవర్. అంతేకాకుండా కొంతమంది మాత్రం ఆమె బయటకు వచ్చాక కూడా కొన ఊపిరితో ఉందని,వెంటనే సెయింట్ మార్తా ఆసుపత్రికి తీసుకెళ్లామని,కానీ వైద్యుడు చికిత్స అందించడానికి నిరాకరించారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక నిమిషం ఆగి ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి కావు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వారి కుటుంబానికి సానుభూతి తెలిపి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- బ్రేకప్ అయిన మూడేళ్ల తర్వాత..మాజీ లవర్ కి దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రియుడు..!!
- ప్రేమన్నాడు..పెళ్లి పేరుతో నమ్మించాడు.. అన్ని కానిచ్చి చివరికి..!!
- కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి..మంచి జరగదు..!!