Advertisement
మానవ జీవితంలో పుట్టుక చావుకు మధ్యలో వచ్చే అత్యంత అద్భుతమైన ఘట్టం వివాహం మాత్రమే. చావును పుట్టుకను ఎవరు చూడలేరు కానీ పెళ్లిని మాత్రం వారికి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అలాంటి పెళ్లి ప్రస్తుత కాలంలో చాలా డిఫరెంట్ గా జరుగుతోంది. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటే, మరి కొంతమంది అరేంజ్డ్ వివాహాలు చేసుకుంటున్నారు. ఏ విధంగా చేసుకున్నా కానీ పూర్వకాలంలో ఉన్న పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిలకు చాలా డిఫరెంట్ వచ్చింది. పూర్వకాలంలో పెళ్లి విషయంలో అయితే పెద్దలు నిర్ణయించేవారు.
Advertisement
ముందుగా పెద్దలు వెళ్లి అమ్మాయిని లేదా అబ్బాయిని చూసి వచ్చి వారికి నచ్చితే పెళ్లి చేసేవారు. ఇలా అమ్మాయి, అబ్బాయి ప్రమేయం ఎక్కువగా ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి కలుసుకొని వారి మధ్య అన్ని కలిస్తేనే పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి ఈ తరుణంలో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి..
#1. వరుడు జాబ్ ప్రొఫైల్ :
ముఖ్యంగా పెళ్లి చేసుకునే ముందు వరుడు ఎక్కడ జాబ్ చేస్తారు. ఎంత సాలరీ వస్తుంది. ఆ జాబ్ పర్మినెంటా, లేదా టెంపరరీ జాబా అనేది తప్పనిసరిగా చూడాలి. అంతేకాకుండా తండ్రికి, తల్లికి ఏమైనా జాబ్ ఉందా అలాంటి వివరాలు చూసిన తర్వాతే పెళ్లిళ్లు కుదుర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.
#2ఆస్తుల వివరాలు:
Advertisement
ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు వారి కుటుంబ వ్యవస్థ ఆస్తుల వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన అమ్మాయిని వారింట్లోకి ఇస్తున్నామంటే మనపై మళ్ళీ ఆధారపడకుండా ఉండాలి. ఒకవేళ వారికి ఇల్లు ఉందనుకోండి ఆ ఇల్లు పై ఏమైనా అప్పులు, వివాదాలు ఉన్నాయా, లేదంటే ఆస్తి ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిందా, ఉమ్మడి కుటుంబం ఆస్తులు అయితే వీరికి ఎంత వాటా వస్తుందనేది క్లియర్ గా తెలుసుకోవాలి. అలా కాకుండా ఉమ్మడి గా ఉండే ఆస్తిని వారు చూపించినప్పుడు మీరు ఓకే చెబితే పంపకాలు జరిగినప్పుడు వీరి వాటా తక్కువ అయితే అప్పుడు బాధపడవలసిన అవసరం వస్తుంది.
#4.ఆరోగ్యం:
ప్రస్తుత కాలంలో అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. కాబట్టి పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో పరీక్షలు చేయించాలి. ఇలా చేయించడం వల్ల పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది.
#4. వ్యసనాలు:
పెళ్లికి ముందే కొంతమంది అమ్మాయిలకు, అబ్బాయిలకు అనేక వ్యసనాలు ఉంటాయి. పెళ్లి సమయంలో మా అబ్బాయికి, మా అమ్మాయికి ఎలాంటి అలవాట్లు లేవని చెబుతారు. పెళ్లి అయిన తర్వాత అలవాట్లు కనిపిస్తే గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే ముందుగానే చెప్పాలి.
మరికొన్ని ముఖ్య వార్తలు :