Advertisement
సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు తన అందచందాలతో దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. గ్లామరస్ పాత్రలను పోషిస్తూ.. వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది సిల్క్ స్మిత. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలో సిల్క్ స్మిత ఉండాలని పట్టుపట్టేవారంట.. 1970లో సౌత్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత కాలం నడిచింది. ఆమె పాట లేని సినిమా అప్పట్లో రాలేదంటే అతిశయోక్తి కాదు. కళ్లతోనే ప్రేక్షకులను మత్తులోకి ముంచేది. ముఖ్యంగా కళ్లే ఆమెకు అందం, బలం అని చెప్పవచ్చు. ఏలూరుకి చెందిన సిల్క్ స్మిత నాలుగో తరగతి వరకే చదివింది.
Advertisement
పదిహేనో ఏటనే పెళ్లి చేసుకుంది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాస్ చేరుకుంది. అక్కడ టచప్ పని చేసేది. ఈ నేపథ్యంలో ఆమెని గమనించిన మలయాళ దర్శకుడు ఆంథోని ఈస్ట్ మన్ దర్శకత్వంలో ఇనయె తేడీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా సిల్క్ స్మిత కెరీర్ నాశనం చేశారనే ఆరోపణలు వినిపించాయి. అతడి వల్లనే సిల్క్ స్మితకు అవకాశాలు రాలేదట. డిప్రెషన్ లోకి వెళ్లిన స్మిత 1996లో అకస్మాత్తుగా మరణించింది. ఆమె చనిపోవడానికి ముందు ఓ లేఖ రాసుకుంది. అందులో ఇలా రాసుకొచ్చింది. “ దేవుడా నా 7వ ఏటా నుంచి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశాను. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను. కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా.
Advertisement
అతను నన్ను మోసం చేశాడు. దేవుడంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారుణం. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను” అంటూ బాధతో స్మిత రాసుకొచ్చింది. కాగా స్మిత చనిపోయినప్పుడు చివరిసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒకరూ కూడా వెళ్లలేదు. ఆమె కుటుంబ సభ్యులు వెళ్లలేదు. ఓ అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు. హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతిక కాయాన్ని చూసేందుకు వెళ్లాడట. సిల్క్ స్మిత, అర్జున్ ఇద్దరూ మంచి స్నేహితులు. అప్పటికే ఒంటరితనంతో కుంగిపోయిన సిల్క్ స్మిత.. “నేను చనిపోతే కనీసం నువ్వుఅయినా చూడటానికి వస్తావా అని అర్జున్ ని తరుచూ అడిగేదట. తప్పకుండా వస్తాను” అని అర్జున్ మాట ఇచ్చాడు. సిల్క్ స్మితను చివరిసారి చూడడానికి తాను మాత్రమే వచ్చాడు. సిల్క్ స్మిత చనిపోయిన ఇన్నేళ్ల తరువాత కూడా ఆమె రాసిన చివరి ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
కీళ్ల నొప్పులు రోజు రోజుకు పెరుగుతున్నాయా ? అయితే ఇలా చేస్తే మటు మాయం..!