Advertisement
భారతదేశ స్వాతంత్య్ర సమర యోధుల్లో వీర్ సావర్కర్ ఒకరు. వినాయక్ దామోదర్ సావర్కర్ న్యాయవాది, కార్యకర్త, రచయిత, రాజకీయ వేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఆయన 140వ జయంతి సందర్భంగా ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం తొలి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రణదీప్ హుడా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఉత్కర్ష్ నైతానితో కలిసి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. అయితే అసలు వీర్ సావర్కర్ ఎవరు ? ఆయన చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా స్వాతంత్య్రం పొందడంలో తమ వంతు పాత్ర పోషించిన ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ప్రతీ ఒక్కరూ అంతగా గుర్తింపు పొందలేదు. వారిలో కొద్ది మంది మాత్రమే గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రు ఇలా కొద్ది మంది మాత్రమే గుర్తింపు పొందారు. ఈ సినిమా టీజర్ లో చూపించినట్టు ప్రజలు సాయుధ విప్లవ మార్గాన్ని అనుసరిస్తే భారతదేశ స్వాతంత్య్రం తగ్గిపోతుందని నమ్మాడు సావర్కర్. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాశాడు. ఇది ప్రచురణకు ముందే బ్రిటిష్ ఇండియాలో నిషేధించబడినట్టు సమాచారం.
Advertisement
హిందుత్వ పితామహుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అఖిల భారత హిందూ మహాసభలో చేరారు. బెంగాలీ సంప్రదాయవాది చంద్రనాథ్ బసు రూపొందించిన హిందుత్వం అనే పదంపై ఆయన దృష్టి సారించారు. 1909 మింటో-మోర్లే సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు సావర్కర్ అరెస్ట్ అయ్యాడు. సెల్యూలర్ జైలులో దాదాపు 50 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. 1924లో విడుదలయ్యాడు. సావర్కర్ 1921లో బ్రిటీష్ వారిచే క్షమాపణ పొందాలని సంతకం చేశారు. అతను విడుదలైన తరువాత రాజకీయాలకు, విప్లవ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని వాగ్దానం చేశాడు. అతని క్షమాబిఖ్ష పిటీషన్ల కారణంగా కొందరూ అతడిని దేశ ద్రోహి అని, బ్రిటీష్ బానిస అని పిలిచారు. 1948లో మహాత్మా గాంధీ మరణించడానికి అతను అభియోగాలు కూడా మోపారు. సాక్షాధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం కేవలం 4 నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గాడట రణదీప్ హుడా. ఇటీవల విడుదలైన టీజర్ లో రణదీప్ వాయిస్, నటన అద్భుతంగా ఉన్నాయి. నిజంగా సావర్కర్ ను చూస్తున్నామా అన్నట్టుంది టీజర్. రణదీప్ ఆ పాత్రలో అలా లీనమైపోయాడు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
కొడుకు చనిపోయాక కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!