Advertisement
అంబటి రాయుడు అంటే క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. తెలుగు వాడిగా భారత క్రికెట్ జట్టులో ప్రత్యేక గుర్తింపు పొందిన రాయుడు పలుమార్లు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఇదే తనకు చివరి టోర్నీ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు తన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు రాయుడు.
Advertisement
వాస్తవానికి అంబటి తిరుపతి రాయుడు హైదరాబాద్ లోనే పెరిగాడు. అయితే అతను పుట్టింది మాత్రం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో. అంబటీ అందుకే ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సిద్దిపేట స్టేడియంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ట్రోపీ సీజన్ 3ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు విచ్చేశారు. హీరో నానిని, క్రికెటర్ అంబటి రాయుడిని చూడటానికి అభిమానులు పెద్దఎత్తున క్రికెట్ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంబటి రాయుడు.. సీఎం కేసీఆర్ కి తాను పెద్ద ఫ్యాన్ ని అని చెప్పుకొచ్చాడు. సిద్దిపేటకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పదేళ్లలో ఇండియాలో జరగని అభివృద్ధి సిద్ధిపేటలో జరిగిందని ప్రశంసించారు.
Advertisement
టీమిండియాలో తెలుగు వాళ్లు చాలా మంది ఆడాలని కోరాడు. సిద్దిపేట క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావును కోరాడు అంబటి రాయుడు. అంబటి రాయుడు తెలుగులో మాట్లాడుతున్నంత సేపు చాలా ఆసక్తిగా తిలకించాడు హీరో నాని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎకరంన్నర భూమి ఇచ్చాడు అంబటి రాయుడు. అదే కాళేశ్వరం నీటితో వ్యవసాయం చేస్తున్నాడు. చదువుకున్న యువత మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి రావాలని.. ఈ ఆలోచనే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిందని చెప్పుకొచ్చారు రాయుడు. అంబటి రాయుడు ఐపీఎల్ లో దాదాపు 190కి పైగా మ్యాచ్ లు ఆడాడట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అప్పట్లో ఎన్టీఆర్ ఫుడ్ 24 ఇడ్లీలు, 30 బజ్జీలు.. ఇంకా మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
మధ్యలోనే ఆగిపోయిన రాజమౌళి రెండు సినిమాలు ఇవే..!!
ఐదేళ్ల పాటు ప్రేమించి..పెళ్లి పత్రిక కూడా రాయించుకొని.. చివరికీ ఏం జరిగిందంటే ?