Advertisement
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనకి తెలిసిందే. గత ఏడేళ్లుగా వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారు అని వార్తలు వినపడుతున్నాయి. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కాంబినేషన్లో మిస్టర్ సినిమా మొదట వచ్చింది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ కాంబినేషన్లో తర్వాత మరొక సినిమా కూడా రావడం జరిగింది.
Advertisement
నిహారిక పెళ్లి టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు వార్తలు నెట్టింట షికార్లు కొట్టాయి. రాజస్థాన్లో నిహారిక పెళ్లి జరిగింది ఆ పెళ్ళికి కేవలం కొద్ది మంది అతిథులు మాత్రమే వచ్చారు. వాళ్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు. పైగా మెగా ఫ్యామిలీ ఫొటోస్ లో కూడా లావణ్య త్రిపాఠి కనపడ్డారు. దీంతో అందరికీ కాస్త అనుమానం వచ్చింది. ఏదో నడుస్తున్నట్లు అప్పుడే అందరికీ అర్థం అయింది. రీసెంట్ గా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేశారు.
Advertisement
కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. చావు కబురు చల్లగా అనే సినిమాలో లావణ్య త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి అల్లు అరవింద్ వచ్చారు. అప్పుడు ఆయన ఒక హింట్ ఇచ్చారు. కానీ అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు.
ఇప్పుడు అందరికీ క్లియర్ గా అర్ధం అయింది. ”నార్త్ నుండి వచ్చి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు ఇక్కడే ఒక కుర్రాడిని పెళ్లి చేసుకో” అని అన్నారు అల్లు అరవింద్. దాంతో లావణ్య త్రిపాటి ఒక్కసారిగా షాక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. మేం అర్థం చేసుకోలేదంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు.
Also read:
భార్య ఉండగా మగవారు ఇంకొక మహిళ తో సంబంధం పెట్టుకోవడానికి… 5 కారణాలు ఇవే..!