Advertisement
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాల్సిన తల్లినే కూతురు తన సొంత చేతులతో చంపేసింది నవమాసాలు మోసి ప్రాణం పోసిన కన్నతల్లి ని చంపేసి ఆ డెడ్ బాడీ ని సూట్ కేస్ లో పెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళింది. ఈ సంఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే బెంగళూరు క్రైమ్ న్యూస్ మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్ కి సేనాలి సేన్ ఒక సూట్కేస్ తో వెళ్ళింది. ఈమె వయసు 39 ఏళ్లు.
Advertisement
పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె సూట్ కేస్ ని ఓపెన్ చేసి తన తల్లి బాడీని చూపించింది. పోలీసులు ఏమి ప్రశ్నించక ముందే తానే చంపేశానని చెప్పింది. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇక ఆమె తల్లి వివరాల లోకి వెళితే.. తల్లి పేరు బీవా పాల్ ఆమె వయసు 70 ఏళ్లు. బెంగళూరులోని నివసిస్తున్నట్లు తెలుస్తోంది హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది పోలీసులు తెలుసుకున్నారు. అయితే హత్య చేసిన సేనాలి మానసిక వికలాంగురాలు.
Advertisement
సేనాలికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అదే ఫ్లాట్లో సేనాలి తన అత్త కొడుకులతో పాటుగా ఉంటోంది. సేనాలి అత్తకి తల్లికి మధ్య ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేది. సేనాలి కొడుకు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. కొడుకు అనారోగ్యం వాళ్ల గొడవలు వలన మానసికంగా కృంగిపోయింది నిద్ర మాత్రలు ఇచ్చేసి తానే స్వయంగా తల్లిని చంపింది.
నిద్ర మాత్రలు ఇచ్చి తను చనిపోయే వరకు దగ్గరే ఉన్నానని ఆ తర్వాత బాడీని సూట్ కేస్ లో పెట్టి ఉబర్ ద్వారా ఆటో బుక్ చేసుకుని తల్లి మృతదేహంతో పోలీస్ స్టేషన్ కి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో జరిగిందేది కూడా తన అత్త కొడుకులకు తెలియదని ఆమె చెప్పింది. ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్నల మధ్య గొడవ జరిగేవి అందుకే దీనివల్ల డిప్రెషన్ కి లోనైంది ఆమె. అయితే తల్లి అత్తతో గొడవ పడడం ఏమాత్రం ఇష్టం లేక కన్న తలని ఇంట్లోనే ఆమె చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
Also read: