Advertisement
సౌందర్య సావిత్రి తర్వాత మంచి పేరు తెచ్చుకున్న నటి. నటనతో అభినయంతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చాలా మంది టాప్ హీరోల సరసన సౌందర్య నటించిన మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఎక్స్పోజింగ్ చేయనని నటనతో అవకాశాలని సంపాదించుకుంది చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో సౌందర్య చెప్పినట్లే చెప్తారు. కానీ తర్వాత వచ్చిన పాత్రలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే సౌందర్య మాత్రం తన మాట మీద కట్టుబడి ఉంది.
Advertisement
మంచి పాతల్ని చేసిందే తప్ప ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలేదు. సౌందర్య తండ్రి తో పాటుగా ఓ రోజు షూటింగ్ కి వెళ్ళింది. అప్పుడే నటిగా మారాలని నిర్ణయించుకుంది సౌందర్య. మనవరాలు పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సౌందర్య. ఆ సినిమా నిర్మాణ సమయంలో ఉన్నప్పుడే సౌందర్యకి మరెన్నో అవకాశాలు వచ్చాయి అలా వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ సౌందర్య పెద్ద నటిగా మారిపోయింది. మంచి మంచి అవకాశాలు రావడంతో బిజీ అయింది సౌందర్య.
Advertisement
కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. సౌందర్య రైతు భారతం అమ్మోరు ఇలా ఎన్నో సినిమాలు చేసింది. పెద్ద హీరోల సరసన కూడా నటించి అందరిని బాగా ఆకట్టుకుంది. ఇలా సౌందర్య మంచి మంచి పాత్రలు చేసింది అప్పట్లో ఒకటి రెండు సినిమాల షూటింగ్ కూడా ఒకేరోజు వెళ్ళేది సౌందర్య. ఆమె డేట్స్ ప్రకారం నిర్మాతలు షెడ్యూల్ ని కూడా మార్చుకునే వారట.
సౌందర్య తండ్రి జ్యోతిష్యుడు ఆయన 2004లో సౌందర్య కెరియర్ ముగిసిపోతుందని చెప్పారు అయితే సౌందర్య మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. నేను ఇంకా సినిమాలు చేస్తానని సౌందర్య చెప్పేది. 50 ఏళ్ళు వచ్చేవరకు కూడా నటిస్తానని సౌందర్య చెప్పేది. కానీ బీజేపీ పార్టీ ప్రచారం కోసం సౌందర్య ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు సౌందర్య, సౌందర్య సోదరులు ఇద్దరు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
Also read:
రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే..!
పవన్ కళ్యాణ్ భార్య ”అన్నా లెజినోవా” కి ఆ హీరో అంటే ఇష్టం.. మీకు తెలుసా..?
మగధీర లో ఆ సీన్ ని చిరు నుండే కాపీ కొట్టారు.. రాజమౌళి కూడా ఒప్పుకున్నారు..!