Advertisement
పెళ్లి అయిన తర్వాత తన భర్త తో కలిసి జీవితాంతం ఆనందంగా ఉండాలని మహిళలు అనుకుంటారు. అయితే అందరూ ఆనందంగా కలిసి జీవించలేరు. ఎన్నో ఇబ్బందుల్ని అత్తవారింట ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మంది అత్తవారింటికి వెళ్లి సుఖంగా జీవించలేరు. కుటుంబ కలహాలు ఆర్థిక పరిస్థితులు లేక పోతే ఏదైనా చిన్నపాటి గొడవలు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
Advertisement
ఈ మధ్య కాలం లో ఎక్కువగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచు మనకి కనబడుతూనే ఉన్నాయి. అయితే అత్త వారింట్లో వేధింపుల్ని తట్టుకో లేక ఒక మహిళ చావే నయం అని అనుకుంది. అయితే ఇంట్లో గొడవల వలన పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని పిల్లల తో పాటుగా ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది.
Advertisement
ఇక వివరాల్లోకి వెళ్లి పోదాం.. గణేష్, సౌందర్య భార్యాభర్తలు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. బన్సీలాల్ పేట లో ఉన్న డబుల్ బెడ్ హౌస్ ని తన పేరు మీద రాయాలని గొడవ చేసే వాడట. యాదాద్రి లో తన భార్య పేరు మీద ఉన్న ప్లాట్ ని కూడా అతని పేరు మీద రాయమనేవాడట. కూతురి పేరు మీద వున్న భూమి ని కూడా తనకే రాయమని అడిగేవాడట.
పెళ్లైన తరువాత లావు గా మారిపోయావు. అందంగా లేవు అని కూడా చెప్పేవాడట. ఇలా ఏదో ఓ గొడవ చేసేవాడట. వీటిని తట్టుకో లేక బన్సీలాల్ పేట లోని ఎనిమిదో అంతస్తు నుండి తన కవల పిల్లల తో పాటుగా దూకేసింది. ముగ్గురు కూడా చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also read:
సౌందర్య తండ్రి ఆమె చనిపోతుంది అని ముందే చెప్పేసారా..?
రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే..!
పవన్ కళ్యాణ్ భార్య ”అన్నా లెజినోవా” కి ఆ హీరో అంటే ఇష్టం.. మీకు తెలుసా..?