Advertisement
టీం ఇండియా క్రికెట్ జట్టు లో చాలా మంది ఆడారు. సీకే నాయుడు నుంచి మహ్మద్ సిరాజ్ వరకు ఎంతో మంది భారత్ తరపున ఆడారు. తెలుగు ప్రజలు గర్వపడే క్రికెటర్లలో అంబటి రాయుడు కూడా ఒకరు. బ్యాటర్ గా రాయుడు ఎంతో చేసాడు. అందుకే బాగా గుర్తుంది పోయాడు. చాలా సార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి కష్టాల్లో వున్నా జట్టు కి గెలుపు ని అందించాడు. మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. చక్కటి గుర్తింపు లభించింది.
Advertisement
ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఆడి మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అందించిన సేవల కి గానూ కప్ తీసుకునే సమయంలో ధోని తన కి బదులు రాయడు ని పంపాడు. 2023తో క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి సడెన్ గా ఫోకస్ ని రాజకీయాలపై పెట్టాడు. ఏపీ సీఎం జగన్ ని కలిసాడు. దానితో అంతా షాక్ అయిపోయారు. వైసీపీలో ఇతను చేరడం ఖాయమే అని అందరికీ అర్ధం అయ్యింది. అయితే డైరెక్ట్ వైసీపీ కి వెళ్ళడానికి కారణం టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అని అర్ధం అవుతోంది.
Advertisement
టీడీపీ తో, బీజేపీతో ఎంఎస్కే ప్రసాద్ కి సత్సంబంధాలు వున్నాయట. ఈయన పొలిటికల్ సపోర్టుతో బీసీసీఐ లో ఉండేవారు. ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా వున్నప్పుడు వన్డే ప్రపంచ కప్ 2019 అయ్యింది. అయితే మంచిగా ఆడిన రాయుడిని ప్రపంచ కప్ టీమ్ కి తీసుకోలేదు. అందుకే అతని కెరీర్ పాడయ్యింది అని తెలుస్తోంది. ఈ కారణంగానే వైసీపీలో చేరాడు అనే వాదన వినపడుతోంది. అందుకే డైరెక్ట్ గా వైసీపీ వైపు అంబటి రాయడు ఫోకస్ పెట్టేసాడు.
Also read:
పెళ్ళై 29 ఏళ్ళు అయ్యింది.. ఆ కారణంతో.. ఇంత దారుణానికి.. అసలేం జరిగిందంటే..?
”వారంలో ఆ నాలుగు గంటలే ఆనందం”.. శ్రీజ తో కళ్యాణ్ దేవ్ విడిపోయినట్టేనా..? పోస్ట్ వైరల్..!