Advertisement
పెళ్లి చేస్తున్నప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఎంత వయసు తేడా ఉండొచ్చు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులకి చాలా సంవత్సరాల క్రితం ఉండేటువంటి పరిస్థితులకి ఎన్నో తేడాలు ఉన్నాయి. అయితే ఇది వరకు 11 సంవత్సరాలు లేక 20 సంవత్సరాలు వయస్సు తేడా ఉన్నా సరే పెళ్లిళ్లు చేసేవారు.
Advertisement
కానీ ఇప్పుడు 5 ఏళ్ళు కూడా చాలా ఎక్కువ అని అందరూ భావిస్తున్నారు. కాకపోతే కొంతమంది అనేక కారణాల వల్ల వయసులో ఎక్కువ తేడా ఉన్నా చేసుకోవాల్సి వస్తుంది. మరి నిజానికి ఎన్ని ఏళ్ళు అమ్మాయికి మరియు అబ్బాయికి మధ్య ఏజ్ గ్యాప్ ఉండొచ్చు అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. మరి ఇప్పుడే చూసేద్దాం..
ప్రస్తుతం అయితే ఐదు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఒక జనరేషన్ మారిపోయినట్టు భావిస్తున్నారు. ఎందుకంటే ఇరువురి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఆలోచనా విధానం చాలా మారిపోతుంది. అందువల్ల ఐదేళ్ల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ను ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితుల వలన ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న వారితో ఒక పెళ్లి చేయాల్సి వస్తే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
కొంతమంది ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా సరే ఇష్టం వల్ల పెళ్లి చేసుకుంటున్నారు, కాకపోతే ఎప్పుడైతే ఈ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండి వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి చాలా మంది సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం. వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వారు సంతోషంగా ఉన్నారు. అయితే అది ప్రతి ఒక్కరికి వర్తించదు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండి, ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే పెళ్లి చేసుకోకపోవడమే మేలు.
Also read:
వర్మతో ఆ సినిమా ఆఫర్ ని పవన్ కళ్యాణ్ ఎందుకు వదులుకున్నాడు..? కారణం ఏమిటి అంటే..?
ధోని హెల్మెట్ పై భారతీయ జెండా ఎందుకు ఉండదు..? కారణం ఏమిటి అంటే..?
మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని.. ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన నటులు వీళ్ళే..!