Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి తెర మీదకి తీసుకువచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అందరం చూసాం. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత జక్కన్న తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపుని తెచ్చుకుంది. రాజమౌళి సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు అందరూ.
Advertisement
రాజమౌళి డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోలు భావిస్తారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో గమనించినట్లయితే శివుడు (ప్రభాస్) అవంతిక కోసం కొండ మీదకి ఎక్కుతూ ఉంటాడు. ఎన్నోసార్లు కొండ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాడు. అయినా కూడా మళ్లీ మళ్లీ పైకి ఎక్కాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనం చూసాం.
Advertisement
అయితే ఈ సినిమాలో రాజమౌళి మాత్రం ఒక తప్పు చేశారు. మరి జక్కన్న చేసిన తప్పేంటి అనేది ఇప్పుడే చూద్దాం.. ప్రభాస్ కొండ మీదికి వెళ్తున్నప్పుడు కిందకి జారి పడినప్పుడు ఊడలకి చిక్కుకు పోతాడు. అవంతిక ని అందుకోవడానికి వెళ్లేటప్పుడు ఒక ఊడ దొరుకుతుంది. నెక్స్ట్ సీన్ లో చూసినప్పుడు ఊడలు ఉన్న ప్రదేశానికి తను వెళ్తున్న చోటికి చాలా దూరం ఉంటుంది.
అయినా కూడా శివుడు ఆ ఊడని పట్టుకుని పైకి ఎక్కేస్తాడు. ఎలా అందింది అనేది ఎవరికి తెలీదు. పైగా ఇంకో సీన్ లో ఏమవుతుందంటే శివుడు పైకి వెళ్తున్నప్పుడు ఎటువంటి చెప్పులు కూడా వేసుకోడు. కానీ పైకి వెళ్ళిన తర్వాత శివుడు కాళ్ళకి చెప్పులు ఉంటాయి. ఈ తప్పుని కూడా రాజమౌళి చేశారు. ఎలా ఈ తప్పుని రాజమౌళి చూడలేదు..?
Also read:
మరణించిన వ్యక్తి యొక్క.. ఈ 3 వస్తువులని అస్సలు ఉపయోగించద్దు..!
తొలి ఏకాదశి నాడు ఇలా దీపారాధన చేస్తే.. డబ్బుకి లోటు ఉండదు..!