Advertisement
ఆచార చాణక్య నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని ఎంతో వివరంగా వర్ణించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ఎటువంటి సమస్యకైనా సరే సులభంగా పరిష్కారం దొరుకుతుంది. ఆచార్య చాణక్య భార్య భర్తల మధ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, స్నేహితుల మధ్య సమస్యలు, జీవితంలో గెలవడానికి మార్గాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఎంతో బాగా చెప్పారు.
Advertisement
అయితే చాణక్య ఎటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రం ఇంట్లోకి రానివ్వకండి. ఇటువంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆచార్య చాణక్య చెప్పారు. మరి ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులని ఇంట్లోకి కానీ జీవితంలోకి కానీ రానివ్వకూడదని చాణక్య అన్నారు.
ప్రపంచంలో చాలామంది అసలు రంగులుని దాచుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు నిజాయితీగా ఉంటారు. కానీ వెనుక చాలా చెడుగా వుంటారు. అలాంటి వారిని అసలు ఇంట్లోకి రానివ్వకూడదని ఆచార్య చాణక్య అన్నారు, అందరి ముందు చాలా తియ్యగా చక్కగా మాట్లాడుతారు కానీ వెనుక మాత్రం పుకార్లు చెబుతూ ఉంటారు.
Advertisement
అలానే కొంతమంది చెడు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని కూడా నమ్మకండి వాళ్లతో దూరంగా ఉండండి. వాళ్ళు మీతో ఉంటే వెన్నుపోటు పొడుస్తారు, మీ గురించి చెడుగా చెప్తారు. ఆపద సమయంలో ఎవరైతే మీకు తోడుగా ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే వాళ్ళతో మాత్రం దూరంగా ఉండటం మంచిది. అలాంటి వ్యక్తులను అసలు ఇంట్లోకి రానివ్వకండి. అలానే కొంతమంది ఇతరులను బాధ పెడతారు. వాళ్ళు ఆనందంగా ఉంటారు. అలాంటి వారిని కూడా దూరంగా ఉంచండి అటువంటి వాళ్ళతో కూడా స్నేహం చేయకండి ఇంటికి రానివ్వకండి.
Also read:
ప్రియుడిని రిసార్టుకు తీసికెళ్ళి మోసం.. సినిమాటిక్ రేంజ్ లో షాక్ ఇచ్చిందిగా.. ఆఖరికి..?
ఒక్కర్తే కూతురు.. భర్త, బావ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య..!
బాహుబలి సినిమాలో.. జక్కన్న చేసిన ఈ చిన్న తప్పుని మీరు గమనించారా..?