Advertisement
తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటారు. అందుకని తల్లి కచ్చితంగా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలి. స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి మంచి పద్ధతుల్ని పాటిస్తే బిడ్డ కూడా మంచి పద్ధతుల్ని అలవాటు చేసుకుంటుంది. తల్లి జీవన శైలి, ఆహారపు అలవాట్లు బట్టి బిడ్డ ఆరోగ్యం ఉంటుంది.
Advertisement
తల్లి కడుపుతో ఉన్నప్పుడు నీతి కథలు చదవడం, సంగీతం వినడం వంటివి చేస్తే కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలో వున్నప్పుడే శిశువు కొన్ని విషయాలని నేర్చుకుంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… తల్లి కడుపులో ఉన్నప్పుడే వినికిడి, శబ్దాలను గ్రహించడం వంటివి బిడ్డ నేర్చుకుంటుంది. రుచిని తెలుసుకుంటుంది. ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు నేర్చుకుంటుందట.
Advertisement
ఒక పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వెల్లుల్లి తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లలు 7 లేదా 8 నెలల్లోనే వెల్లుల్లి రుచిని ఆస్వాదిస్తారు. ఒకవేళ తల్లి క్యారెట్ తినట్లయితే ఐదారు నెలలకి క్యారెట్ రుచిని బిడ్డ గ్రహిస్తుంది. తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అయితే తీసుకుంటుందో అటువంటి ఆహార రుచిని సులభంగా గ్రహిస్తుంది. అలానే ఆ ఆహార పదార్థాన్ని బిడ్డ ఎక్కువగా ఇష్టపడుతుంది.
అమ్మ ఇష్టపడని ఆహార పదార్థాలు బిడ్డ కూడా ఇష్టపడదు. నవజాత శిశువులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మాటల్ని గుర్తించడం కూడా నేర్చుకుంటారు. ఒకవేళ కనుక ఎక్కువ శబ్దాలు పుట్టబోయే బిడ్డ వినకపోయినట్లయితే, బిడ్డ పుట్టిన తర్వాత సంభాషణ లోపాలు కలుగుతాయి. అలానే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి మాటలను బట్టి గుర్తిస్తుందట. తల్లి కడుపులో ఉన్నప్పుడు బయట శబ్దాలకి బిడ్డ లోపల కదులుతూ ఉంటుంది.
Also read: