Advertisement
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి హిట్ లభించలేదు. మంచి హిట్ కోసం ప్రభాస్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మంచి హిట్ ప్రభాస్ కి రావాలని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
Advertisement
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఐదు గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమాకి ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ కి సంబంధం ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కాబోతోంది ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా స్టోరీ పై రకరకాల కథనాలు ఇప్పటికే వస్తున్నాయి. సలార్ టైటిల్ అంటే ఏంటో అన్న దాని మీద కూడా ఆసక్తి అందరికీ కలుగుతోంది.
Advertisement
ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. సలార్ అనే పదం ఉర్దూ పదం. ధైర్యవంతుడు, బలమైన నాయకుడు అని అర్థం వస్తుంది. పాతబస్తీలో ఎంఐఎం పాగా వేయడంతో అసదుద్దున్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ పాత్ర చాలానే వుంది. రజాకార్ అధినేత ఖాసీం రజ్వీ తరువాత అసదుద్దీన్ తాత వాహెద్ అలీ ఖాన్ తరవాత అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఎంఐఎం పగ్గాలు చేపట్టారు.
అయితే అక్కడ వాళ్ళు అంతా కూడా సలార్ అని గౌరవంగా ఆయన్ని పిలిచేవారు. ఈ టైటిల్ చూసి మా పాతబస్తీ నాయకుడైన సలావుద్దీన్‌ను గుర్తు చేసినందుకు అసదుద్దిన్ ఓవైసి అలానే ఎంఐఎం శ్రేణులు సంతోషిస్తున్నారు. 1984 నుంచి 1999 వరకు ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా నియమితులయ్యారు.
Also read: