Advertisement
భార్యాభర్త కలిసి ఆనందంగా ఉంటేనే వారి యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. భార్య మాట భర్త భర్త మాట భార్య కచ్చితంగా వినాలి. కానీ చాలామంది భర్తలు మహిళకేం తెలుసు. ఆమె మాట నేను వినేది ఏంటి అని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు కానీ ఇది వాళ్ళ దాంపత్య జీవితానికి ఇబ్బందిని తీసుకువస్తుంది.
Advertisement
ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి మాట ఒకరు వినడం ఒకరి సంతోషం కోసం మరొకరు అప్పుడప్పుడు త్యాగం చేయడానికి ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యమైనవి. అయితే అందరు భర్తలు ఒకేలా ఉండరు. కొంతమంది భర్తలు వారి భార్య చెప్పిన మాటని అసలు వినరు.
మరి మీ భర్తని కూడా మీరు మీ దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు చూడాల్సిందే. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో భార్య భర్తల బంధం అనేది ఉంటుంది. పైగా ప్రతిక్షణం ఒకరినొకరు గమనించుకోక్కర్లేదు. ఒకరితో ఒకరు ఆనందంగా సమయాన్ని గడపాలి అనుకుంటే సరిపోతుంది. పైగా ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ని మంచి ఫీలింగ్స్ ని మనం పంచితే అవే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి.
Advertisement
మనం చూసే విధానం బట్టి ఉంటుంది మంచిగా చూస్తే మంచిగానే కనపడుతుంది. అలానే చెడుగా చూస్తే కనపడుతుంది కాబట్టి మొదట మనం ఆలోచించే తీరుని మార్చుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి రావు. మనం చెప్పేది ఇంకొకరు వినాలి అంటే కచ్చితంగా పాజిటివ్ థాట్స్ అనేది ఉండాలి అప్పుడు కచ్చితంగా ఎదుట వాళ్ళు వింటారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా చెప్పే ముందు ఏం జరుగుతుందా ఏం జరగబోతుందా అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత రెస్పాన్స్ అవ్వడం మంచిది.
అదేవిధంగా మనం వాళ్లు వింటారా లేదా అనేది భయపడి చెప్పకూడదు యాంగ్జైటీ తో చెప్పినా లేదంటే మరొక ఆలోచనతో చెప్పినా కూడా సరిగ్గా మనం చెప్పాలనుకున్న వాటిని చెప్పలేము కాబట్టి పాజిటివ్ థాట్స్ తో పాజిటివ్ గా చెప్తే కచ్చితంగా ఎవరైనా సరే వింటారు. జస్ట్ ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు కేవలం మీ తీరుని మార్చుకుంటే సరిపోతుంది అప్పుడు ఎటువంటి వారైనా సరే మీ దారిలోకి వస్తారు. భర్త భార్య మాట వినాలంటే కచ్చితంగా భార్య చెప్పే విషయాలు భార్య ఫీలింగ్స్.. భర్త చెప్పాలనుకున్నవి భర్త లోపల ఫీలింగ్స్ ఒకేలా ఉంటే కచ్చితంగా వింటారు. సో పాజిటివ్ థాట్స్ తో పాజిటివ్ గా చెప్పి చూడండి.
Also read: