Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. స్పైడర్ సినిమా ని దాదాపు రూ.125 కోట్ల తో తెలుగు, తమిళ భాషల్లో తెర మీదకి తీసుకువచ్చారు. తమిళ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన నటించిన అలరించారు. ఈ సినిమాలో విలన్ రోల్ ని కాస్త డిఫరెంట్ గా చూపించారు. ఎవరైనా చనిపోతే ఈ సినిమాలో విలన్ దూరం నుండి చూసి ఆనంద పడుతూ ఉంటాడు.
Advertisement
చిన్నప్పటినుండి విలన్ స్వభావం ఇలానే ఉండేది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించింది డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య జె సూర్య. భైరవుడు అనే పాత్రని ఈ సినిమాలో ఆయన పోషించారు. ఆయన చిన్నప్పుడు భైరవుడిగా మాస్టర్ సంజయ్ నటించాడు. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆనందపడడం వంటి సన్నివేశాల్లో మాస్టర్ సంజయ్ చాలా బాగా నటించాడు. ఆ పాత్రకి మంచి పేరు కూడా వచ్చింది.
Advertisement
సంజయ్ కి స్పైడర్ సినిమా తర్వాత సంజయ్ జాక్పాట్, దర్బార్, మూగముని వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. చెన్నైలో పుట్టాడు సంజయ్. కుట్టి టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతున్నాడు. ఇందులో ఫుడ్, డాన్స్ వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా స్పైడర్ సంజయ్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాడు. చక్కటి డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటాడు సంజయ్. అతని వీడియోలు చూసిన నెటిజన్లు పెద్దయక హీరోగా ట్రై చేయమంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also read: