Advertisement
దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శ్రీదేవి తన అందంతో అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకున్నారు. ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీదేవి. ఆమె చనిపోయి ఎన్నో రోజులు అవుతున్నా కూడా ఆమె అందరికీ ఇంకా గుర్తున్నారు. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు శ్రీదేవి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చిన శ్రీదేవి తర్వాత పెద్ద హీరోయిన్ గా మరి ఎన్నో అవకాశాలని సంపాదించుకున్నారు. కెరీర్ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. తల్లి ఆరోగ్యం విషయంలో శ్రీదేవి ఎంతగానో కుమిలిపోయారు. తల్లి చనిపోయిన తర్వాత చెల్లి తో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కోసం కోర్టుకి ఎక్కారు.
Advertisement
Advertisement
రెండవ పెళ్లి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చనిపోయే వరకు కూడా శ్రీదేవి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అత్తవారింట్లో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. భర్త బోని కపూర్ సినిమాలు తీసి అప్పులు పాలైతే, ఆ అప్పులు తీర్చడానికి కూడా ఆమె ఎంతో కష్టపడింది. చివరికి చెన్నై, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులని అతన్ని నమ్మి ఇచ్చేసింది శ్రీదేవి. తాజాగా శ్రీదేవికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. చిన్నతనం నుండి అందరికీ బాగా సంపాదించి పెట్టింది శ్రీదేవి. కానీ మనశ్శాంతి దొరకలేదుట. పైగా బోని కపూర్ కి సంబంధించిన ఫ్యామిలీ ఎప్పుడూ కూడా శ్రీదేవి కుటుంబాన్ని దగ్గరికి రానివ్వలేదుట.
Also read: