Advertisement
జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క సారిగా హీట్ ని పెంచేసింది. ముఖ్యమంత్రి పదవి మీద మొదట్లో ఆసక్తి లేనట్లు పవన్ కళ్యాణ్ చెప్పేవారు కానీ ఇప్పుడు రాజకీయ అధికారానికి జనసేన సిద్ధంగా ఉందని… జనసేన పార్టీ గెలుపొందితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే విషయాలకు మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పార్టీ గెలుపొందితే ఆయా వర్గానికి చేయబోయే మేలు ఏంటో కూడా సభల్లో చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా జనసేనకు అండగా నిలబడటానికి సిద్ధం అయ్యింది.
Advertisement
అయితే ఇప్పుడు జనసేన ఎదుగుదల తెలుగుదేశం పార్టీ కి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో టీడీపీ మీడియా కూడా ఉండడంతో జనసేన Vs వైసిపి గా మారిపోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
మరో పక్క టీడీపీ ప్రాధాన్యత బాగా తగ్గినట్లు కనపడుతోంది. బీజేపీ సపోర్ట్ దొరకడంతో భారీ సీట్లు డిమాండ్ చేసే వైపు జనసేన చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్తే ఏమవుతుందని దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. వైసిపి గ్రాఫ్ బాగా తగ్గింది కాబట్టి అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: