Advertisement
స్కాలర్ షిప్ ని పొందాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తాయి స్కాలర్ షిప్స్. స్కాలర్ షిప్ లతో చదువుకోవాలనుకున్న చదువుని పూర్తి చేసుకోవచ్చు. స్కాలర్ షిప్ ల ద్వారా విద్యార్థుల రుణాల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి పోస్ట్ గ్రాడ్యుకేషన్ విద్యార్థుల వరకు ఈ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. మరిక పూర్తి వివరాలను చూసేద్దాం.
Advertisement
1. భారతీయ పౌరులకు మాత్రమే ఇది. నుండి 12వ తరగతి, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్లకి ఇది. దరఖాస్తుదారులు వారి మునుపటి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులతో ఫ్యాన్ అయ్యుండాలి. కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా INR 2.5 లక్షల కంటే తక్కువే ఉండాలి. వారే అర్హులు. INR 75,000 వరకు పొందవచ్చు. 30-09-2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
2. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్‌షిప్. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ క్రీడాకారులు, వ్యక్తుల కోసం ఇది. కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30-08-2023. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Advertisement
3. రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్‌లు 2023. మహిళా ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ ఇస్తోంది. ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్న బాలికలు ఇందుకు అప్లై చెయ్యవచ్చు. స్కాలర్‌షిప్ వారి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. AICTE- గుర్తింపు పొందిన సంస్థ లో ఏరోస్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వంటి రంగాలలో ప్రస్తుతం 1వ/2వ/3వ సంవత్సరం చదువుతున్న బాలికల కోసం తీసుకు వచ్చారు. 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలలో 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన బాలికలు దరఖాస్తు చెయ్యచ్చు. INR 35,000 వరకు పొందవచ్చు.దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31-08-2023.
Also read:
- వారికి వైద్య సేవలు అందాలి.. అవసరమైతే హెలికాఫ్టర్ కూడా..వైద్యారోగ్య శాఖ అధికారులకి మంత్రి హారీష్ రావు కీలక ఆదేశాలు…!
- తెలుగుదేశానికి ఒంటరి పోరే మంచిదా..?
- చిరు మొదలు బాలయ్య, ఎన్టీఆర్ దాకా లుక్స్ తో ప్రేక్షకులని డిసప్పాయింట్ చేసిన.. టాప్ హీరోలు వీళ్ళే..!