Advertisement
మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు ఏది జరిగినా కూడా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. చనిపోయినప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. శవయాత్రని నిర్వహించేటప్పుడు డబ్బులు వేస్తారు. డప్పులు వాయిస్తారు. బాణసంచా పేలుస్తూ ఘనంగా చనిపోయిన వాళ్ళని తీసుకు వెళ్తూ ఉంటారు.
Advertisement
అయితే ఎందుకు డబ్బులు వేస్తూ తీసుకెళ్తారు..? శవ యాత్రలో భాగంగా మరణించిన వారి మీద పూలు చల్లడం, మరమరాలు చల్లడం, డబ్బులు చల్లడం వంటివి చూస్తూ ఉంటాము. అయితే ఎందుకు చనిపోయిన వాళ్ళని ఊరేగిస్తూ డబ్బులు చల్లుతారు అనే విషయానికి వచ్చేస్తే.. చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్లలేరు.
Advertisement
అందుకని ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి ఇలా చేస్తారు అని కూడా అంటూ ఉంటారు. చనిపోయిన వారి అంతిమయాత్రలో డబ్బులు చల్లితే ఆ డబ్బులు నిరుపేదలు, చిన్నపిల్లలు తీసుకుంటారు. వాళ్లకి సహాయం చేసినట్టు ఉంటుందని కూడా భావించి ఈ విధంగా చేయడం జరుగుతుంది.
పూలు చల్లడం అనేది మరణించిన వాళ్ళని గౌరవించడం అని కూడా చెప్పొచ్చు. పేలాలని కూడా చనిపోయిన వాళ్ళ మీద చల్లుతూ తీసుకు వెళ్తుంటారు.
పైగా పేలాలు చల్లుతూ తీసుకెళ్లడం వలన పక్షులు, క్రిమి కీటకాలకి ఆహారం ఇస్తున్నట్లు కూడా భావించి ఇలా చేయడం జరుగుతుంది. ఇలా శవం మీద డబ్బులు చల్లుతూ తీసుకు వెళ్ళడం వెనుక వివిధ కారణాలైతే ఉన్నాయి.
Also read: