Advertisement
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి, మంచి పేరు తెచ్చుకున్నారు. 26 ఆగస్టు 2008 న ప్రజారాజ్యం అనే పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి తిరుపతి నుండి ఎంపీగా చిరంజీవి గెలిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యాక ఆగస్టు 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లు చిరు ప్రకటించారు.
Advertisement
a
కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా పని చేశారు ఏపీ రాజకీయాల నుండి మెగాస్టార్ చిరంజీవి దాదాపు 10 ఏళ్ల క్రితమే విరమించుకున్నారు. అయినా కూడా ఆయన పేరు ఇప్పటికి కూడా వినపడుతోంది. ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాలు మీద ఫోకస్ పెట్టారు చిరంజీవి. చిరంజీవి పై నమోదైన కేసు ఏపీ హైకోర్టు కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
ఇక వివరాలను చూసేద్దాం… 2014 సార్వత్రిక ఎన్నికల వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు చిరు. కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయక పోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు 2014లో గుంటూరు పోలీసులు చిరు పై కేసు నమోదు చేశారు.
కేసుని కొట్టివేయాలని ఏపీ హైకోర్టు ని ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ హైకోర్టులో నిరూపించకపోవడంతో చిరు పై కేసు కొట్టేశారు. ఏపీ హైకోర్టు కేసు కొట్టేయడం తో పెద్ద ఊరట లభించింది. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా..? వస్తే ఎప్పుడు వస్తారు అంటూ చిరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఇంకో పక్క సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన చిరు సినిమాలతో బిజీగా వుంటున్నారు. భోళా శంకర్ సినిమాతో మన ముందుకి త్వరలో చిరు రానున్నారు.
Also read: