Ads
మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేందుకు కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు అనారోగ్యాన్ని కూడా తెలియజేస్తాయి. ముఖ్యంగా మనిషికి సమయానికి తిండి, కంటినిండా నిద్ర చాలా అవసరం. కానీ పెరుగుతున్న బాధ్యతలు, చేస్తున్న ఉద్యోగం, పనివేళలు ఈ రెండింటినీ సరిగ్గా ఉండనివ్వవు. ఫలితంగా అనారోగ్యం పాలవుతుంటాం. ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకుంటే వారి కన్నా ఆరోగ్యవంతులు ఇంకెవ్వరు ఉండరట. చాలా మందికీ రాత్రివేళ ఆలస్యంగా ఆహారం తినడం, నిద్రలేమి కారణంగా కాలకృత్యాలలో ఇబ్బందులు తెలెత్తుతాయి. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలను తెలుసుకుందాం.
Advertisement
- రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ నీటిలో జీలకర్ర వేసి మరిగించి ఆ నీటిని తాగితే జీర్ణవ్యవస్థ తీరు మెరుగు అవుతుంది. కడుపు కూడా క్లీన్ అవ్వడంతో పాటు బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
- ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ వామును.. గ్లాసున్నర నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం నీటిని గ్లాసు అయ్యేవరకు మరిగించి.. అందులో నిమ్మరసం కలిపి తాగాలి. వెయిట్ తగ్గాలనుకునేవారికి అద్భుతంగా పని చేస్తుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు తరచూ రాకుండా ఉంటాయి.
- ప్రతీ రోజూ వాము వాటర్ తాగడం వల్ల యూరిన్ ఇన్ ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
- గోరువెచ్చని నీటిలో తేనె-నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మలబద్ధకం అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
- కలబంద రసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లోపలి నుంచి శరీర కాంతిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.