Advertisement
రైళ్ళకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా మందికి తెలియని విషయాలు ఉంటూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే మనం జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అయితే మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కానీ రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు కానీ పట్టాల మీద కంకర రాళ్ళని చూస్తూ ఉంటాము. అయితే అసలు కంకర రాళ్ళని ఎందుకు రైల్వే ట్రాక్‌ల మీద వేస్తూ ఉంటారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దాని వెనుక కారణమే ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
రైల్వే ట్రాక్‌లపై పట్టాల మధ్య లో కంకర రాళ్ళని రైల్వే సిబ్బంది నింపుతూ ఉంటారు. దాన్ని ట్రాక్ బాలస్ట్ అని అంటారు. పట్టాలు నిర్దిష్ట స్థానంలో ఉండేందుకు కంకర ను పట్టాల మధ్యలో రెండు వైపులా పోస్తారు. రైలు వెళుతున్నప్పుడు భారీ శబ్దాలు వస్తూ ఉంటాయి. ట్రైన్ పెద్ద శబ్దంతో వెళ్ళినప్పుడు దగ్గరలో ఉండే భవనాలకి ప్రమాదం కలగొచ్చు. ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ రాళ్లు ఏం చేస్తాయంటే.. ఆ శబ్దాలని తగ్గిస్తాయి. ట్రాక్‌ల మీద మొక్కలు వంటివి కూడా రాకుండా చేస్తాయి. వర్షం నీళ్లు ట్రాక్ మీద నిలవకుండా కూడా ఇవి సహాయపడతాయి.
Also read: