Advertisement
‘నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ స్వాతంత్రం కొసం పోరాడిన భారత దేశ కీర్తి కిరీటం సుభాష్ చంద్ర బోస్. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణ లో పెట్టారు బోస్. సుభాష్ చంద్ర బోస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- సుభాష్ చంద్రబోస్ వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు, స్వామి వివేకానంద రామకృష్ణ చెప్పిన వాటికి ఇన్స్పైర్ అయ్యారు.
- సుభాష్ చంద్రబోస్ చాలా తెలివైన వారు. స్కూల్లో, యూనివర్సిటీలో మంచి ర్యాంకులు ని ఆయన తెచ్చుకునేవారు. ఎప్పుడూ కూడా టాప్ మార్కులు సుభాష్ చంద్రబోస్ కి వచ్చేవి. 1918 లో సుభాష్ చంద్రబోస్ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.
- ఏప్రిల్ 24 1924లో నేతాజీ కార్పొరేషన్ ఆఫ్ కలకత్తా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద నియమితులయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే.
1938 – 1939లో బోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. - 1921 నుండి 1940 వరకు 11 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు.
- వియన్నా బోస్‌కు ఇష్టమైన నగరం. 1930లలో వియన్నాలో ఎక్కువ సమయం అక్కడే గడిపారు. 1935లో అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నారు కూడా. అక్కడే ఆయన ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం ని రాసారు. వియన్నాలో అతను తన జీవిత భాగస్వామి ఎమిలీ షెంక్ల్ను 1934లో కలుసుకున్నారు కూడా.
- గాంధీజీ తత్వాలను సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించినప్పటికీ, ఆయనను ‘దేశభక్తుల దేశభక్తుడు’ అని పిలిచేవారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసారు. చేయకుండా వదిలేసింది ఏమి లేదుట.
- ఇండియన్ నేషనల్ ఆర్మీకి కమాండర్-ఇన్-చీఫ్‌గా, నేతాజీ బోస్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆగ్నేయాసియాలో బోస్ తో ఓ కోతి ఉండేది. కోతి అఆయన భుజం మీద కూర్చుని రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూ ఉండేదట.
- ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర
పోషించారు. - సుభాష్ చంద్ర మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీ గానే మిగిలిపోయింది. ఓవర్ లోడ్ తో కూడిన జపాన్ విమానం తైవాన్ లో కూలిపోవడంతో కాలిపోయి మరణించాడని అన్నారు కానీ కారణం తెలీదు. ఇంకా అది మిస్టరీ గానే మిగిలిపోయింది.
Also read: